Home /News /andhra-pradesh /

GUNTUR DAUGHTER IN LAW KILLED MOTHER IN LAW FOR HARASSING HER IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Guntur Woman : అత్తాకోడళ్ల ఫైటింగ్.. చివరికి పోలీసుల్నే పరుగులు పెట్టించింది.. అసలేం జరిగిందంటే..

హత్యకు గురైన మైథిలి (ఫైల్)

హత్యకు గురైన మైథిలి (ఫైల్)

Family Issues: చాలా చోట్ల అత్తాకోడళ్లు నిత్యం కొట్లాడుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి ఇవన్నీ శ్రుతిమించుతుంటాయి. అలా ఓ అత్తగారి వేధింపులు ఎక్కువవడంతో ఓ కోడలు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

  ఇల్లన్నాక కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవలు సహజం. అయితే అత్తాకోడళ్ల మధ్య మాత్రం నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. కోడలిపై పెత్తనం చెలాయించాలని అత్త... అత్తగారి ముందు తలవంచకూడదని కోడలు. నిత్యం కొట్లాడుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి ఇవన్నీ శ్రుతిమించుతుంటాయి. అలా ఓ అత్తగారి వేధింపులు ఎక్కువవడంతో ఓ కోడలు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేరుకాపురం పెడదామని భర్తపై ఒత్తిడి చేస్తుంటారు. కానీ అలా కాకుండా ఏకంగా అత్తగారిని అనంతలోకాలకు పంపేసిందో కోడలు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలోని ప్యారడైజ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న తాడికొండ మైథిలి(53) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  అత్త మైథిలి వేధింపులు తట్టుకోలేక కోడలు రాధా ప్రియాంక హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో మైథిలి నిద్రపోతున్న సమయంలో ఆమెపై కోడలు ప్రియాంక కూరగాయలు తరిగే చాకు, చపాతి కర్రతో దారుణంగా పొడిచి హత్య చేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న టూటౌన్ పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

  ఇది చదవండి: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా..? అయితే జాగ్రత్త... మీ ఇంటికి పోలీసులు రావొచ్చు..


  గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదనపు కట్నం కోసం కోడళ్లను చిత్రహింసలు పెట్టడం.. ఆ తర్వాత హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం లాంటి కేసులు చాలానే ఉన్నాయి. ఎక్కువ కట్నం తేలేదనో.., పిల్లలు పుట్టడం లేదనో.., మర్యాదలివ్వడం లేదనో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి.

  ఇది చదవండి: తోకపై నిల్చొని ఈలేస్తున్న కోబ్రాలు.. ఏపీలో అరుదైన జీవుల సంచారం.. ఎక్కడంటే..!


  ఇటీవల విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో ఉషా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అత్తింటి వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ప్రసాదంపాడుకు చెందిన ఉష.. లబ్బిపేటకు చెందిన ఫణిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఉష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా.. ఆమె భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేస్తున్నాడు. ఐతే తొలుత ఉష ప్రేమ పెళ్లిని అంగీకరించని ఆమె తల్లిదండ్రులు ఇటీవలే మాట్లాడటం మొదలుపెట్టారు. ఐతే ఇటీవల ఉషకు మరో పెద్దకంపెనీలో జాబ్ వచ్చింది. మంచిజీతం కావడంతో తన లక్ష్యం నెరవేరిందని ఉష భావించింది.

  ఇది చదవండి: ఏడేళ్ల ప్రేమ... ప్రియుడు పెళ్లికి నో చెప్పడంతో యువతి చేసిన పనికి గంటలో పెళ్లైంది..


  ఐతే ఈ విషయాన్ని పుట్టింటివారికి చెప్పొద్దని అత్తింటివారు ఆమెను బెదిరించారు. రాఖీ పండుగ సందర్భంగా పుట్టింటివారితో ఆమెకు మంచి జాబ్ వచ్చిందని చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఉష అత్త, భర్త, బావ, తోటికోడలు ఆమెను దూషించారు. కొత్త జాబ్ కు వెళ్లొద్దని వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అత్తింటివారిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Guntur, Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు