Home /News /andhra-pradesh /

GUNTUR CYBER CRIME GANGS CHEATED TWO WOMAN IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Cyber Crime: ఆరోగ్యశ్రీ కార్డు వాడకుంటే రూ.50వేలు... ఏడు వారాల నగలు రూ.2లక్షలు... అక్కడే ఉంది అసలు మతలబు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య శ్రీ వాడని వారికి జగన్ ప్రభుత్వం రూ.50వేల గిఫ్ట్... ఎయిర్ పోర్టులో 2లక్షలు కడితే ఏడువారాల నగలు మీ సొంతం.. ఇదంతా నిజం అనుంటే మీరు మోసపోయినట్లే...!

    దొంగతనాలు చేయాలంటే తాళాలు పగలుగొట్టాలి. గోడకు కన్నం వేయాలి. ముసుగులు ధరించి ఎవరికీ చిక్కకుండా పనికానిచ్చేయాలి. ఇదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు కేటుగాళ్లు రూటుమార్చారు. ఆన్ లైన్లోనే డబ్బును అమాంతం దోచేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, ఓటీపీలు, గూగుల్ పే, మ్యాట్రిమోనీ సైట్స్ , ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సైట్స్ ఇలా అంతా ఇంటర్నెట్ ద్వారానే జనాల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఇలాంటి ఘటనలో అంధ్రప్రదేశ్ లో ఇటీవల బాగా జరుగుతున్నాయి. తాజాగా ఒకడు ఆరోగ్య శ్రీ పేరుతో మరొకడు మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లి సంబంధం పేరుతో మహిళకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు నగరంలోని కొరిటెపాడు హనుమానం నగర్ కు చెందిన సుజాత అనే మహిళకు ఓ ఫోన్ వచ్చింది. ఆరోగ్య శ్రీ నుండి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఐదేళ్ల నుంచి ఆరోగ్య శ్రీ వినియోగించనందుకు ప్రభుత్వం మీకు రూ.50వేలు ఇస్తోందని నమ్మబలికాడు.

    ఇందుకుగానూ ఎకౌంట్ నెంబర్ కన్ఫామ్ చేసుకోవడానికి రూ.10వేలు ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. ఆ కేటుగాడు చెప్పిన మాటలు నమ్మిన సుజాత రూ.10వేలు జమ చేసింది. ఐతే ఎకౌంట్లో రూ.10వేలు పడలేదని మరోసారి జమచేయాలని చెప్తూ అలా రూ.30వేలు వేయించుకున్నాడు. మీరు వేసిన డబ్బులతో పాటు ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలు వస్తాయని నమ్మించాడు. ఆ తర్వాత నెంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన సుజాత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ప్రియుడి మోజులో భార్య... అడ్డుగా ఉన్న భర్త.. మరిదితో కలిసి మర్డర్ స్కెచ్.. చివరికి ఇలా దొరికిపోయింది..


    ఇక మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయం చేసుకొని చేసిన మరో మోసం కూడా వెలుగు చూసింది. బాపట్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి తన పెళ్లి సంబంధం కోసం ఓ మ్యాట్రిమోని వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో కేరళకు చెందిన పాల్ మాణిక్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం తాను యూకేలో ఉంటున్నాని.. మీరు నచ్చారని.. పెళ్లి చేసుకుంటానని ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం మీ అత్తగారికి ఉన్న ఏడువారాల నగలు యూకే నుంచి కొరియర్ లో పంపానని ఆమెకు చెప్పాడు.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ లాక్ డౌన్... మధ్యాహ్నం 2గంటల తర్వాత అంతా బంద్... ఎక్కడంటే..!


    కొన్నిరోజుల తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు.. మీకు ఓ పార్సిల్ వచ్చిందని.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉందని యువతికి చెప్పారు. పార్శిల్ మీకు రావాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు నమ్మేసిన యువతి.. ఇంట్లోవారికి తెలియకుండా వారి రూ.2.25 లక్షలు జమ చేసింది. ఆ తర్వాత పార్సిల్ కోసం ఫోన్ చేయగా.. అటువైపు నుంచి స్పందన లేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    మీ నగరం నుండి (​గుంటూరు)

    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cheating, CYBER CRIME, Guntur

    తదుపరి వార్తలు