హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: వేలు పెడితే లక్షలు.. లక్షలు పెడితే కోట్లలో లాభం.. యాపారం బాగుందిలే అనుకుంటే అంతే సంగతులు..

Guntur: వేలు పెడితే లక్షలు.. లక్షలు పెడితే కోట్లలో లాభం.. యాపారం బాగుందిలే అనుకుంటే అంతే సంగతులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Online Cheating: మీరు ఖాళీగా ఉన్నారా..? ప్రముఖ కంపెనీ ల డీలర్ షిప్ ఇస్తాం అని కొందరు..! స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి మిమ్మలని కోటీశ్వరులను చేస్తామని మని కొందరు.., వేలు లక్షలు పెడితే కోట్లలో సంపాదించండి అంటూ ఆన్ లైన్లో ఊదరగొడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

మీరు ఖాళీగా ఉన్నారా..? ప్రముఖ కంపెనీ ల డీలర్ షిప్ ఇస్తాం అని కొందరు..! స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి మిమ్మలని కోటీశ్వరులను చేస్తామని మని కొందరు.., వేలు లక్షలు పెడితే కోట్లలో సంపాదించండి అంటూ ఆన్ లైన్లో ఊదరగొడుతున్నారు. అవకాశాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులు వీరి వలలో పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో ప్రముఖ FMCG సంస్థకు డీలర్ షిప్ కావాలనే అనే ప్రకటన చూశాడు. ప్రస్తుతం ఉద్యోగవేటలో ఉన్న యువకుడు.. తల్లిదండ్రులకు భాగం కాకూడదనే ఉద్దేశంతో ప్రకటనలో ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా వారిని సంప్రదించాడు. సంస్థ ప్రతినిథులమంటూ లైన్లోకి వచ్చిన వ్యక్తులు.. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రూ.21వేలు చెల్లించాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన యువకుడు.. ఆ డబ్బులు చెల్లించాడు.

కొన్నిరోజుల తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ పంపి.. సరుకు కోసం డబ్బులు జమ చేయాలని కోరారు. ఐతే లెటర్ పై అనుమానం వచ్చిన యువకుడు.. సదరు కంపెనీపై ఆరా తీయగా బోగస్ సంస్థ అని తెలింది. అతడితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఇలాగే మోసపోయినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: మచిలీపట్నంలో యువతిపై గ్యాంగ్ రేప్..? పోలీసులమంటూ తసుకెళ్లి ఘాతుకం.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్


ఇటీవల విజయ వాడ లో ఒక యువకుడు మెడికల్ డీలర్ షిప్ ఇస్తామని ప్రకటన చూసి బగ్గీ ఇండియా సంస్థకు ఐదు లక్షల రూపాయలు కట్టాడు. ఎన్నిరోజులైనా సరుకు రాకపోవడంతో యువకుడు కంపెనీ చిరునామా పట్టుకొని ఇండోర్ వెళ్ళాడు. అక్కడకు వెళ్లిన యువకునికి మార్కెటింగ్ మేనేజర్ అని పరిచయమైన అతను నలబై ఐదు రోజులలో మీ డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో తిరిగివచ్చేశాడు. ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇది చదవండి: తల్లిని చూడకూడని స్థితిలో చూసిన కొడుకు.. అవమానం తట్టుకోలేక ఎంత పనిచేశాడంటే..


ఇదిలా ఉంటే షేర్ మార్కెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఓ ఉద్యోగికి ఇటీవల ఓ ఫోన్ వచ్చింది. తాము షేర్ మార్కెట్లో ఎక్స్ పర్ట్స్ అని.. తమ సలహాలతో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు.. అందుకు తగ్గట్లు అతడి దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేశారు. అలా విడతలవారీగా మొత్తం ఊడ్చేశారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తే నమ్మవద్దని.. ఒకవేళ మాట్లాడినా అలాంటివారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దంటున్నారు పోలీసులు. పెట్టుబడి పెట్టే విషయంలో నిపుణుల సలహా తీసుకొని ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన సైబర్ నేరాలపై ప్రముఖ FMCG కంపెనీకి చెందిన మేనేజర్ శ్రావణ్ ను న్యూస్ 18 సంప్రదిస్తే తమ సంస్థ లో ఆన్లైన్ ద్వారా డీలర్ షిప్ లు ఆఫర్ చేసే పద్ధతి లేదని స్పష్టం చేశారు. తాము ఎక్కడైనా డీలర్ ను నియమించుకోవాలంటే.. ముందుగా తమ సంస్థ ప్రథినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలంచి.. ఆర్థిక, సామాజిక వెసులుబాటు చూసుకున్న తర్వాతే ఎంపిక చేస్తామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, CYBER CRIME, Guntur

ఉత్తమ కథలు