GUNTUR CYBER CRIME GANG CHEATED YOUNG MAN BY BLACKMAILING WITH NUDE VIDEO CALLS IN GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN GNT
Blackmailing: మత్తుగా మాట్లాడింది.. న్యూడ్ వీడియో కాల్ చేసింది.. ఆ తర్వాత మొదలెట్టింది అసలు సినిమా..
ప్రతీకాత్మకచిత్రం
అందమైన అమ్మాయిల ఫోటోలు, పేర్లతో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయడం, యువకులకు, మధ్య వయసులో ఉన్న పురుషులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులు చాటింగ్ చేసి మెల్లగా ముగ్గులోకి దించుతారు. మాటలతో రెచ్చగొట్టి న్యూడ్ వీడియో కాల్ (Video Calls) చేయించుకుంటారు.
ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ( Cyber Crime) టెక్నాలజీని ఉపయోగించి అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడతో జనం నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్, ఫేక్ యాప్ లతో డబ్బులు దోచేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిలింగ్ దందా నడుపుతున్నారు. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను (Facebook) క్రియేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అందమైన అమ్మాయిల ఫోటోలు, పేర్లతో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయడం, యువకులకు, మధ్య వయసులో ఉన్న పురుషులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులు చాటింగ్ చేసి మెల్లగా ముగ్గులోకి దించుతారు. మాటలతో రెచ్చగొట్టి న్యూడ్ వీడియో కాల్ (Video Calls) చేయించుకుంటారు. ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. డబ్బులివ్వకుంటే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదరించి చుక్కలు చూపిస్తారు.
ఇటీవల ఈ తరహా నేరాలు ఆంధ్రప్రదేశ్ లో తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో లాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్ బుక్ లో యువతి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అయితే అమ్మాయి నుండి రిక్వెస్ట్ రావడంతో టెంప్ట్ అయిన అతడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతి అతడితో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. కొన్నిరోజులకు అతడి మొబైల్ నెంబర్ సేకరించి ఫోన్ చేసి మాట్లాడుతుండేది. రెచ్చగొట్టేలా మాట్లాడటంతో ఆ యువకుడు పూర్తిగా ఆమె మాటల మాయలో పడిపోయాడు. ఆమె ఏం చెబితే అది చేసేవాడు.
ఈ క్రమంలోనే వీడియో కాల్ చేసిన యువతి ఇద్దరం న్యూడ్ గా మారి మాట్లాడుకుందామని కోరింది. మొదట యువతి న్యూడ్ గా మారడంతో రాజేష్ కూడా ఏమాత్ర ఆలస్యం చేయకుండా నగ్నంగా ఆమెతో ముచ్చటించాడు. అంతే ఒక్కసారి గా కథ అడ్డం తిరిగింది. సదరు యువతి రాజేష్ కు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోలని బయటపెడతానని బెదిరించింది . దీంతో భయపడిన రాజేష్ మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. తన మిత్రులతో కలిసి ఆ నెంబర్ కి ఫోన్ చేయగా అది ఒక అబ్బాయిది తెలిసింది. దీంతో అవాక్కవటం రాజేష్ వంతైంది.
పోలీసులు మాత్రం రాజస్థాన్ కు చెందిన సైబర్ క్రైమ్ ముఠా ఇలాంటి నేరాలకు పాల్పడుతోందని గుర్తించారు. యువకుడు అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు దాదాపు పది వరకు వెలుగుచూశాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు, మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుండా చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.