హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: తెనాలిలో రాజకీయ రంగస్థలం..! నాటకరంగాన్ని అవకాశంగా తీసుకుంటున్న పొలిటికల్‌ లీడర్స్‌..!

Guntur: తెనాలిలో రాజకీయ రంగస్థలం..! నాటకరంగాన్ని అవకాశంగా తీసుకుంటున్న పొలిటికల్‌ లీడర్స్‌..!

తెనాలిలో కల్చరల్ పాలిటిక్స్

తెనాలిలో కల్చరల్ పాలిటిక్స్

ప్రజలలో పాపులారిటీ కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు అక్కడి పొలిటికల్‌ లీడర్స్‌. టీడీపీ (TDP) నేత ఎన్టీఆర్‌ (NTR) శత జయంతి వేడుకలను ఏడాది పొడువునా నిర్వహిస్తుంటే... వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత వైఎస్సార్ జాతీయ పోటీలను నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  నాటకరంగంలో గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి (Tenali) పెట్టిందిపేరు. అలాంటి తెనాలి ప్రాంతం ఇప్పుడు రాజకీయ రణరంగస్థలంగా మారిపోయింది. ప్రజలలో పాపులారిటీ కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు అక్కడి పొలిటికల్‌ లీడర్స్‌. టీడీపీ (TDP) నేత ఎన్టీఆర్‌ (NTR) శత జయంతి వేడుకలను ఏడాది పొడువునా నిర్వహిస్తుంటే... వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత వైఎస్సార్ జాతీయ పోటీలను నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెనాలి నుండి టిడిపి సీనియర్ నేత రాజా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో అన్నాబత్తుని శివ కుమార్ చేతిలో ఓడిపోయారు. మరోవైపు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా గత ఎన్నికల్లో ఇక్కడ నుండే పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత మూడేళ్లలో ప్రజల్లో ఉండేందకు నాయకులు నానాతిప్పలు పడుతున్నారు.

  అధికార పార్టీ నేతగా, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. అటు ప్రతిపక్ష నేత ఆలపాటి రాజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే ఆలపాటి అందుకున్నారు.

  ఇది చదవండి: ఈ చెస్‌ బోర్డును చూశారా ? ఇక్కడ చెస్‌ ఆడాలంటే నిలబడాల్సిందే..! నడవాల్సిందే..! ఎక్కడుందంటే..!

  తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో ప్రతి రోజూ ఎన్టీఆర్ సినిమాను ఉదయం షోను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ప్రతి నెల ఎన్టీఆర్ శతజయంతి వేడుకల పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. జయసుధకు ఎన్టీఆర్ అవార్డును ప్రకటించారు. రాఘవేంద్రరావు ఒక నెలలో ప్రత్యేక ఆహ్వానితుడిగా తెనాలి వచ్చి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఇలా అనేక కార్యక్రమాలను ఆలపాటి రాజా నిర్వహిస్తున్నారు. సాధరణంగా సినిమా నేతల ప్రభావం తెనాలిలో అధికంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

  ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

  అలనాటి మేటి నటులైన సావిత్రి, శారద, జగ్గయ్య, కృష్ణ, గుమ్మడి అంతా తెనాలి ప్రాంతానికి చెందిన వారే.. ఈ నేపథ్యంలోనే తెనాలిలో సినిమా ప్రభావం అధికంగా ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నిస్తుంటారు. మాజీ ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కలిసొస్తుందని.. ఎమ్మెల్యే తెనాలి శివ కుమార్ తనదైన శైలిలో ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  ఇది చదవండి: ప్రభుత్వ స్కూల్‌నే కబ్జా చేసిన సర్పంచ్.. ఇదేనా నాడు-నేడు..?

  గత నెలలో జాతీయ స్థాయి నాటక పోటీలను నిర్వహించారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. సాంస్కృతిక అంశాలనే ఆధారంగా చేసుకొని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మూడో నేత నాదెండ్ల మనోహర్ కూడా నియోజకవర్గానికి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం.

  దీంతో ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల బరిలోకి దిగేందుకు మరోసారి సిద్దమవుతున్నారని ఇప్పటి నుండే ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్మాలు ముమ్మరంగా చేస్తున్నారనే టాక్‌ చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ప్రజా సమస్యలతో పాటు కళలు రాజకీయాల్లో భాగం కావటంపై తెనాలిలో ఆసక్తి కర చర్చకు దారి తీసింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Guntur, Local News

  ఉత్తమ కథలు