Gangadhar, News18, Guntur
బాపట్ల జిల్లా (Bapatla District) కేంద్రంలో నూతనం గా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ కు వైసీపీ రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలకు ఇలా పార్టీ రంగులు వేయటం ఏంటి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల బాపట్ల జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రభుత్వ వైద్యశాలని 350 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంలో పలు ప్రభుత్వ భవనాలకు ఇదే తరహాలో రంగులు వేయడంతో ప్రతీపక్షాల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. రాష్ట్ర హైకోర్టు నుండి కూడా ప్రభుత్వానికి అక్షింతలు పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే హాస్పిటల్ పనులు ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (APMSIDC) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని,ఆ సంస్థ ఉన్నతాధికారుల సూచనల మేరకే నీర్ధేశిత ప్రోటోకాల్ ప్రకారమే తాము ఈ రంగులు వేశామని సదరు కాంట్రాక్టర్ తెలియజేశారు.
ఏది ఏమైనప్పటికి ప్రభుత్వ భవనాలకు ఇలా పార్టీ రంగులు స్పురించేలా కాకుండా అందరికి ఆమోద్యమైన రంగులు వేస్తే బావుంటుంది అంటున్నారు స్థానికులు. టీడీపీ సీనియర్ నియకుడు కొల్లి బ్రహ్మయ్య ప్రభుత్వం వేసిన రంగులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయా భవనాల నిర్మాణానికి వైసీపీ డబ్బులు కానీ, జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు కానీ ఖర్ఛు పెట్టడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టే పన్నులను మీ ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి కైనా రానున్న సంవత్సర కాలంలో నైనా జగన్ ప్రజారంజికంగా పాలించి అందరి మన్ననలు పొందాలని లేదంటే ఆయనను ఇంటికి సాగనంపడం ఖాయం అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News