GUNTUR COUPLE KILLED YOUNG MAN FOR TOUCHING HAND WHILE DANCING IN MARRIAGE FUNCTION IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Shocking: తమ్ముడి పెళ్లిలో ఉత్సాహంగా డాన్స్ వేస్తున్న అన్న.. ఆమెకు చేయి తగలడంతో ఊహించని పరిణామం..
ప్రతీకాత్మకచిత్రం
Murder in Marriage: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ఖాసీం డాన్స్ వేస్తుండగా.. పోరబాటున షేక్ సైదాబీ అనే మహిళకు చేయి తగిలింది. దీంతో వివాదం మొదలైంది. ఖాసీం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన భర్త షేక్ మస్తాన్ వలీకి చెప్పింది.
అక్కడ పెళ్లి జరుగుతోంది. ఇంటితో పాటు ఆ విధంతా సందడిగా ఉంది. పెళ్లి జరుగుతుండటంతో అందరూ ఆడిపాడుతున్నారు. తన తమ్ముడి పెళ్లి జరుగుతుండటంతో అన్న కూడా ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నాడు. అక్కడ పెట్టిన మ్యూజిక్ కు మైమరిచిపోయి ఆడుతున్నాడు. డాన్స్ వేస్తుండగానే అతడి చేయి ఓ మహిళకు తగిలింది. ఇంకేముందే ఏదోదో జరిగిపోయిందని ఆవిడగారు రాద్దాంతం చేసింది. కట్ చేస్తే పచ్చని పెళ్లి పందిరిలో చావుడప్పు మోగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) దర్శిలోని ముస్లిం బజారులోని హుస్సేన్, దస్తగిరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్దకొడుకు ఖాసీం అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి ఓ ఎరువుల కంపెనీలో పనిచేసేవాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇంటివద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి చిన్నకుమారుడి పెళ్లి జరిగింది.
సోమవారం వధూవరులను ఊరేగిస్తూ ఇంటికి తీసుకొస్తున్నారు. తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ఖాసీం డాన్స్ వేస్తుండగా.. పోరబాటున షేక్ సైదాబీ అనే మహిళకు చేయి తగిలింది. దీంతో వివాదం మొదలైంది. ఖాసీం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన భర్త షేక్ మస్తాన్ వలీకి చెప్పింది. దీంతో ఇద్దరూ క్షణికావేశానికి లోనే ఖాసీంపై దాడి చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఖాసీంను విచక్షణారహితంగా గుండెలపై తన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు చెప్పారు.
ఓ వైపు చిన్న కుమారుడి పెళ్లి జరుగుతుండగానే పెద్ద కుమారుడు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై భీమా నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖాసీంపై దాడి చేసిన దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొనకమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన పాపయ్య పాపులమ్మ దంపతులు నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన పాపయ్య తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. అక్కడే ఉన్న పాపయ్య చిన్నకుమారుడు వెంకటపతిరాజు తండ్రికి సర్దిచెప్పేందుకు యత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన పాపయ్య.. కొడుకుపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. వెంటనే వెంకటరాజు తప్పుకోగా పాపయ్య ముందుకు పడిపోయాడు. తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాపయ్య తనంతట తానే పడిపోయాడా..? లేక కుటుంబ సభ్యులు దాడి చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.