Home /News /andhra-pradesh /

Guntur Woman: కోడలు మూర్ఛవ్యాధితో చనిపోయిందని అందరీ నమ్మించారు... కానీ మూడు నెలల తర్వాత ఇలా బుక్కయ్యారు..!

Guntur Woman: కోడలు మూర్ఛవ్యాధితో చనిపోయిందని అందరీ నమ్మించారు... కానీ మూడు నెలల తర్వాత ఇలా బుక్కయ్యారు..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన షేక్ మహినిషా.. నేతాజీ నగర్ కు చెందిన షేక్ షమీమ్ ప్రేమించుకున్నారు.వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇందుకు మహినిషా తల్లిదండ్రులు అంగీకరించినా.. షమీమ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ప్రేమ (Love) రెండు మనసులను కలుపుతుంది. పెళ్లి రెండు జీవితాలను ఏకం చేస్తుంది. కొందరి ప్రేమ మధ్యలోనే ఆగిపోతే.. మరికొందరు మాత్రం తమ ప్రేమను గెలిపించుకొని పెళ్లి వరకు తీసుకెళ్తారు. అలా ఓ జంట ప్రేమించుకున్నారు. అమ్మాయి తరపు వాళ్లు ఒప్పుకున్నా.. అబ్బాయి తరపు వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు. ప్రేయసిని వదులుకోలేని ఆ యువకుడు తల్లిదండ్రులను ఒప్పించి మరీ తన ప్రేయసిని పెళ్లాడాడు. ఆ అమ్మాయి ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకొని కొత్తకాపురంలోకి అడుగుపెట్టింది. భర్త ప్రేమగా చూసుకుంటున్నా అత్తమామల నుంచి మాత్రం వేధింపులు తప్పలేదు. కోడలు గర్భవతి అయినా వారిలో మార్పు రాలేదు. చివరికి ఆ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన షేక్ మహినిషా.. నేతాజీ నగర్ కు చెందిన షేక్ షమీమ్ ప్రేమించుకున్నారు.

  వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇందుకు మహినిషా తల్లిదండ్రులు అంగీకరించినా.. షమీమ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. అయితే వారిని ఒప్పించిన షమీమ్.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐతే కొడుకు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని షమీమ్ తల్లిదండ్రులు షేక్ ఖాజావలి, షేక్ షహీనా.. కోడలిని వేధించడం మొదలుపెట్టారు. ఆమెను సూటిపోటి మాటలతో వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఐతే భర్తమీద ప్రేమతో వేధింపులను భరిస్తూ వస్తోంది.

  ఇది చదవండి: తమ్ముడి పెళ్లిలో ఉత్సాహంగా డాన్స్ వేస్తున్న అన్న.. ఆమెకు చేయి తగలడంతో ఊహించని పరిణామం..


  ఈక్రమంలో మహినీషా గర్భం దాల్చింది. ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఎలాగైనా కోడలిని చంపేయాలని అత్తమామలు స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని తమ సమీప బంధువులైన బషీర్, షాజహాన్ తో చెప్పారు. అందరూ కలిసి ఈ ఏడాది ఆగస్టులో నిద్రపోతున్న మహినిషా ముఖంపై దిండుతో అదిమిమెట్టి హత్య చేశారు. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కోడలు మూర్ఛ వచ్చి పడిపోయిందని నమ్మించి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు.. ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.

  ఇది చదవండి: భర్తను వదిలేసి ప్రియుడి మోజులో పడింది.. కానీ అదివారం అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!


  ఐతే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అత్తమామలే చంపి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఊపిరిఆడకపోవడం వల్లే మహినిషా చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దాని ఆధారంగా మహినిషా అత్తమామలను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. మహినిషా అత్తమామలు ఖాజావలి, షేక్ హసీనాతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Female harassment, Guntur, Murder

  తదుపరి వార్తలు