Home /News /andhra-pradesh /

GUNTUR COUPLE BOOKED FOR CHEATING A WOMAN ON THE NAME OF MARRIAGE THROUGH MATRIMONY WEBSITE IN GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN GNT

Cheating: వామ్మో ఆ ఘరానా కపుల్ మామూలోళ్లు కాదు... పేరు మార్చి రూ.32లక్షలు దోచేశారు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పెళ్లి (Marriage) చేసుకొని జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో ఓ తోడుంటే హాయిగా ఉండొచ్చని భావిస్తారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతుంటారు.

    పెళ్లి (Marriage) చేసుకొని జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో ఓ తోడుంటే హాయిగా ఉండొచ్చని భావిస్తారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతుంటారు. ఎదుటివారి ఒంటరితనాన్ని క్యాష్ చేసుకునేందుకు కన్నింగ్ స్కెచ్ లు వేస్తుంటారు. అలా ఓ ఘరానా దంపతులు... ఓ యువతికి టోకరా వేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.32 లక్షలు దోచేశారు. ఇందులో భర్తే దొంగ పెళ్లి కొడుకు అవతారమెత్తగా.. భర్త స్కెచ్ లో తాను కూడా భాగస్వామ్యమైన ఆ మహాతల్లి అతగాడికి సహకరించింది. ఇద్దరూ కలిసి ఆమె దగ్గర సర్వం దోచేశారు. తియ్యని మాటలతో ఆమెను నట్టేట ముంచారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

    వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ.. అబ్బూరులోని ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది. ఆమె రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఓ మ్యాట్రిమోనీ సైట్ లో కార్తీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తమది గుంటూరు జిల్లా తెనాలి అని.. చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయినట్లు ఆమెను నమ్మించాడు. నువ్వు బాగా నచ్చావని.. పెళ్లి చేసుకుంటానని తియ్యగా మాట్లాడి ముగ్గులోకి దించాడు. కొన్నిరోజుల తర్వాత అసలు కథ మొదలుపెట్టాడు.

    ఇది చదవండి: కాసేపట్లో పెళ్లి.. వధువు జంప్.. పోలీస్ స్టేషన్ కు మారిన సీన్.. అసలేం జరిగిందంటే..!


    తన కుటుంబానికి చెందిన ఆస్తులను నోట్లరద్దు సమయంలో విక్రయించానని.. ఆ సమయంలో కోట్లాది రూపాయల డబ్బు బ్యాంక్ లో ఉందని చెప్పాడు. ఆ డబ్బును ఐటీ అధికారులు నిలిపేశారని.. ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందని నమ్మించాడు. ఐటీ అధికారులకు డబ్బులిస్తే కోట్లాది రూపాయలు సొంతమవుతాయని చెప్పి ఆమె దగ్గర రూ.32 లక్షలు తీసుకున్నాడు. తన మేనత్త ఖాతాలో డబ్బులు వేయాలంటూ ఓ ఎకౌంట్ నెంబర్ ఇచ్చాడు. అతడు చెప్పిన మాటలు నమ్మి మహిళ.. అప్పుచేసి మరీ సదరు ఎకౌంట్ లో డబ్బులు జమ చేసింది.

    ఇది చదవండి: ఈసీజీ కోసం వెళ్తే దుస్తులు విప్పమన్నాడు.. గుంటూరు జీజీహెచ్ లో దారుణం...



    ఐతే కొంతకాలం కార్తీక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది. పూర్తి వివరాలు ఆరా తీయగా తనకు పరిచయమైన వ్యక్తిపేరు కార్తీక్ కాదని.. అతడి పేరు మహరాజ్ జానీ రెక్స్ అని.. అతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుసుకుంది. ఇతగాడు ఇచ్చిన ఎకౌంట్ నెంబర్ తన మేనత్తది కాదని.. భార్యదని తెలుసుకొని బాధితురాలు కంగుతింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న జానీ రెక్స్.. ఇల్లు వదిలి పారిపోయాడు. మోసంలో భర్తకు సహకరించిన భార్య మహరాజ్ ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భార్యాభర్తలిద్దరు గతంలో అనేక మందిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. మ్యాట్రిమోనీ మోసాల్లో బాగా చదువుకున్నవారే బాధితులుగా తేలుతున్నారు.. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cheating case, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు