Home /News /andhra-pradesh /

GUNTUR CORONA TERROR NO OXYGEN SUPPLY IN ANDHRA PRADESH GOVERNMENT HOSPITALS NGS GNT

Andhra Pradesh: ఏపీలో అమానుషం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాణాలు తీస్తున్న ఆక్సిజన్ కొరత? అయినా పట్టదా?

ఏపీలో ఆక్సిజన్ కొరత

ఏపీలో ఆక్సిజన్ కొరత

ఏపీలో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయా? ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కేకలు మిన్నంటుతున్నాయి. ఆక్సిజన్ లేదంటూ ఆస్పత్రుల దగ్గర బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సరిపడ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయంటోంది. కానీ వాస్తవ పరిస్థిలులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఏపీలో ఆక్సిజన్ కొరత కరోనా రోగులతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్పిటల్స్ లో కరోనా కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కృష్టా జిల్లా గూడురులో అమానుషం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతపై రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆక్సిజన్ సిలండర్లు లేవని వైద్యులు, సిబ్బంది చెప్పడంతో కరోనా రోగులు విలవిలలాడుతున్నారు. తాజాగా గూడురు ప్రభుత్వ ఆస్పత్రిలో సుధాకర్ అనే కరోనా రోగిని అమానుషంగా బయట పడేశారు ఆస్పత్రి సిబ్బంది. రెండు రోజుల కిందట అతడి భార్య కరోనా సోకడంతో మరణించింది. ఇప్పుడు భర్త సుధాకర్ కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే తనకు ఊపిరి అందడం లేదని సుధాకర్ ఆస్పత్రిలో ఆర్తనాదాలు చేస్తున్నాడు. అతడి రోధన విన్న ఆస్పత్రి సిబ్బంది కనికరం చూపించడం లేదు. పైగా ఆక్సిజన్ లేదు అంటూ దురుసగా ప్రవర్తించారు. మరోవైపు ఇదే ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో ప్రమీల అనే కరోనా రోగి ప్రాణాలు విడిచింది. అయినా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. కరోనా బారిన పడ్డ మరో కుటుంబం.. బయట నుంచి 14 వేలు ఖర్చు పెట్టి రెండు ఆక్సిజన్ సిలండిర్లను కొనుగోలు చేసి.. చికిత్స చేయించుకుంటోంది. ఇంతలా ఆక్సిజన్ కొరత వేధిస్తున్నా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని చెప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఏపీ వ్యాప్తంగా కరోనా కలకలం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడడంతో 69 మంది మరణించారు. కరోనా మరణాలు పెరగడానికి అసలైన కారణం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ వైద్య సదుపాయాలు లేకపోవమడే. పోనీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్దామంటే.. అక్కడ వారు అడిగే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి చాలామందింది. ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఎక్కవవగా ఊపిరి అందక మరణించే వారే ఎక్కువగా ఉన్నట్టు రోగుల బంధువులు చెబుతున్న మాటల బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రధాన పట్టనాల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. చాలా ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ నో స్టాక్ అంటూ రోగుల మొహం మీదే చెప్పేస్తున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు అల్లాడుతున్నారు. వెంటిలేటర్ పైనే వందలాది రోగులు ఉంటున్నారు. అయితే ప్లాంట్ నుంచి సరఫరా అవ్వడం లేదని సప్లైయర్స్ చేతులు ఎత్తేస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉంచి వైద్యం అందించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా గూడురులో పరిస్థితి అందుకు అద్దం పడుతోంది.

    ఇటు ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రిలో రోజు రోజుకూ కోవిడ్‌ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. కరోనాతో ఇబ్బంది పడుతూ బెడ్‌లు కేటాయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆక్సిజన్‌ బెడ్‌లన్నీ నిండిపోవడంతో బాధితులు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఊపిరాడని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఆరు బయటే ఆక్సిజన్‌ సిలిండర్ ను ఏర్పాటు చేశారు. కానీ అటు వైపు వైద్యాధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో బాధితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు.

    ప్రకాశం జిల్లాలోని 15 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 186 ఐసీయూ బెడ్లలో 72 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్‌ బెడ్లు 940గాను 127 అందుబాటులో ఉన్నాయి. సాధారణ బెడ్లు 470కిగాను 99 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1,596 పడకలను ఏర్పాటుచేయగా 295 అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అసలు జిల్లా డాస్ బోర్డులో పరిస్థితి ఒకలా ఉంటే. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకలన్నీ నిండిపోగా, వందలమంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఆ దుస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Corona cases, Corona positive, Coronavirus, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు