• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • GUNTUR CORONA POSITIVE CASES INCREASING IN TADEPALLI TOWN ON GUNTUR DISTRICT WHERE CM YS JAGANMOHAN REDDY HOUSE IN LOCATES FULL DETAILS HERE PRN GNT

Corona in AP: సీఎం జగన్ నివాసం వద్ద కరోనా కలకలం.. ఆందోళనలో అధికారులు, స్థానికులు

Corona in AP: సీఎం జగన్ నివాసం వద్ద కరోనా కలకలం.. ఆందోళనలో  అధికారులు, స్థానికులు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా కల్లోలం (Corona Second Wave) సృష్టిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోను రోజుకు 500పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అందరిలోనూ ఆందోళనకలిగిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిథులు కూడా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసముంటున్న తాడేపల్లిలోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. తాడేపల్లిలో ఒక్కరోజులోనే 40 పాజిటివ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. నిత్యం వీఐపీలు, మంత్రులు, ముఖ్యనేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాకపోకలు సాగించే తాడేపల్లిలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవడం చర్చనీయాంశమవుతోంది. ఐతే కరోనా సోకిన వారు ఆస్పత్రులకు వెళ్లకుండా హోం ఐసోలేషన్లోనే ఉంటామని చెప్పి.. అధికారులు వెళ్లిపోయిన తర్వాత హాయిగా బయట తిరిగేస్తున్నారు. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో పాటు సాధారణ జనం వస్తుండటంతో ఉండవల్లి సెంటర్ కరోనా జంక్షన్ గా మారిపోయింది. తాడేపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం, శానిటైజర్లు వాడకపోవడంతో కేసులు అధికమవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.

    గత ఏడాది తాడేపల్లిలో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అంతకంటే ఎక్కువ కేసులు వస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. స్థానికంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాను కట్టడి చేయాలని కోరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ప్రజలు వస్తుండటంతో కేసులు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది..

    ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..? నైట్ కర్ఫ్యూకి డేట్ ఫిక్స్..?


    ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 3,820 యాక్టివ్ కేసులున్నాయి. ప్రతి రోజూ 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. దీంతో తాడేపల్లిలోనూ ఇదే రకమైన అంక్షలు విధించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    ఇది చదవండి: ఏపీ సచివాలయానికి వెళ్తున్నారా...? అయితే జాగ్రత్త ఉండాల్సిందే..! ఎందుకంటే..


    ఇదిలా ఉండే,తాడేపల్లి నుంచి అమరావతి సచివాలయానికి వెళ్లే గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వెలగపూడిల సచివాలయంలో ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన పద్మారావు కరోనాతో మృతి చెందడంతో కలకలం రేగింది. దీంతో సచివాలయంలో 200 మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. 60 మందికి పైగా పాజిటివ్ గా తేలింది. దీంతో సచివాలయానికి వెళ్లాలంటేనే ఉద్యోగులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా రాష్ట్రంలో శుక్రవారం 6,096 పాజిటివ్ కేసులు నమోదుగా.. 2,194 మంది డిశ్చార్చ్ అయ్యారు. మరో 20 మంది మృతి చెందారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు