• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • GUNTUR CORONA DEAD BODIES FUNERAL TENSION IN ANDHRA PRADESH AMBULANCE DRIVERS WILL SUPPORT NGS

Corona Virus: అంబులెన్స్ లోనే అంత్యక్రియలు.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు

Corona Virus: అంబులెన్స్ లోనే అంత్యక్రియలు.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు

అంబులెన్స్ దగ్గరే అంత్యక్రియలు

కరోనా కలకలం రేపుతోంది. ఒక మనిషి చనిపోతే కనీసం నలుగురు మనుషులు ఉండాలి అంటారు. కానీ కరోనా కారణంగా మరణిస్తే ఒక్క మనిషి కూడా ముట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు రోజు రోజుకూ మరణాలు పెరుగుతుండడంతో శ్మశాన వాటికల దగ్గర గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే ఆ వెయిటింగ్ లేకుండా అంబులెన్స్ దగ్గరే అంత్యక్రియల తంతు పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనడం శోచనీయం

  • Share this:
    భారత దేశంపై  కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా సెకెండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. ఊహించని స్థాయిలో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. వందల్లో ఉన్న కేసులు.. రోజుల వ్యవధిలోనే వేలుగా, తరువాత లక్షలుగా మారాయి.  దేశంలో చూసుకుంటే ఇప్పటికే కరోనా కేసులు సంఖ్య 24 గంటల్లో 2 లక్షల మార్కును దాటింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏడు వేల మార్కు దాటేసింది. రోజు రోజు కూ దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య పెరుగుతుండడంతో ఎక్కువ ఆందోళన పెంచుతోంది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజలు నిర్లక్ష్యం వీడకపోవడంతో పరిస్థితి రోజు రోజుకూ చేయి దాటుతోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఉండదని చెబుతున్నా..  ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వాల ముందు కూడా ప్రత్యామ్నాయాలు ఉండవు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరిక్షలు వాయిదా పడ్డాయి.  స్కూళ్లు మూతపడ్డాయి. రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీలోనూ మళ్లీ రాత్రి కర్ఫ్యూ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

    అనుమానాలు సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో మరణాలు మాత్రం భయపడెతున్నాయి. రోజు రోజుకూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని లెక్కల్లోకి కూడా రావడం లేదు. కరోనా పరీక్షలు చేయించుకోకుండానే చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఏపీలో ఇటీవల శ్మశాన వాటికల దగ్గర అంత్యక్రియలు ఎక్కువ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కరోనా మరణాలో, సాధారణ మరణాలో తెలియకపోవడంతో  శ్మశాన వాటిక దగ్గర అంత్యక్రియలు కూడా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో  అంత్యక్రియల కోసం గంటల తరబడి అక్కడ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

    కరోనా బారిన పడిన మరణాలే కాకుండా.. సాధారణ మరణాలు కూడా ఏపీలో పెరుగుతున్నట్టు అచంనా. అందుకే శ్మశాన వాటికల దగ్గర భారీగా క్యూ లైన్లు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ఏపీతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రల్లో పరిస్థితి  మరీ ఘోరంగా ఉంది.  ఒకవైపు రోగులకు చికిత్స అందించడానికి వనరుల కొరత వేధిస్తుంటే, మరోవైపు కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో మృతుల అంత్యక్రియల కోసం బంధువులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.

    ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాజధానుల్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. భోపాల్‌ గ్యాస్ లీక్ విషాధం తర్వాత మొదటిసారి అక్కడ, ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని కొన్ని స్థానిక సంస్థలు చెబుతున్నాయి.  వాస్తవానికి ఏపీలో అంత తీవ్రత లేదనే చెప్పాలి. కానీ గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. అయితే ఏపీతో పలు రాష్ట్రాల్లో ఎక్కడైనా శ్మశాన వాటిక దగ్గర భారీగా క్యూ లైన్లు ఉంటే.. అంబులెన్స్ దగ్గరే అంత్యక్రియల తతంగమంతా పూర్తి చేసేస్తున్నారు. ఆ తతంగం అంతా పూర్తైన తరువాత.. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి బయటకు దింపి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీనికి సబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబులెన్స్ దగ్గరే అంత్యక్రియలు చేస్తున్న పరిస్థితిని ఆ ఫోటోలో గమనించవచ్చు.
    Published by:Nagesh Paina
    First published: