Actor Ali: కమెడియన్ అలీ (Comedian Ali).. జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సినిమాలు మినహా.. అలీ లేని పవన్ సినిమా లేదనే చెప్పాలి.. అంతేకాదు సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర కూడా అలీకి ఉంటుంది. అందుకే పవన్ పై తన అభిమానాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పాki అలీ.. అయితే ఇది ఒకప్పుడు మాత్రమే.. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీ (TDP) లో ఉన్న అలీ.. జనసేనకు మద్దతు ఇస్తారని అంతా ఊహించారు. ఆయన మాత్రం పవన్ అభిమానులకు షాక్ ఇస్తూ.. వైసీపీలో చేరారు. రాజకీయంగా పవన్ కు దూరమైనా.. ఆయనతో స్నేహాన్ని వదులుకోలేదన్నారు అలీ. అందుకు తగ్గట్టే.. పవన్ కు వ్యతిరేక పార్టీలో ఉన్నా.. ఎప్పుడు జనసేనాని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఆ మధ్య అలీ త్వరలో పార్టీ మారుతారని.. వైసీపిని వదిలి.. జనసేనలో చేరుతారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటీవల అలీకి పదవి కట్టబెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ బాధ్యతలు కూడా స్వీకరించారు.
ఈ పదవి స్వీకరించకముందు వరకు ఎప్పుడూ పవన్ ను విమర్శించని అలీ.. తొలిసారి పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అలీ.. నతకు ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరీ తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని.. 2024లో ప్రజలు మళ్లీ ఆయనకు పట్టం కట్టడం ఖాయమని అలీ పేర్కొన్నారు. ఇక్కడి వరకు పరవాలేదు ఏ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ అధినేత గురించి తప్పక చెప్పాల్సిన మాటలు.. అయితే తొలిసారి పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఇదీ చదవండి : చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ ఆలయాలు.. మళ్లీ దర్శనాలు ఎప్పుడంటే?
ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇళ్ల కూల్చివేత్తలపై ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పట్టారు. పవన్ పర్యటనపై అలీ వ్యాక్యలు చేశారు. రోడ్ల విస్తరణను పవన్ కళ్యాణ్ తప్పుబట్టడం సరికాదు అన్నారు అలీ. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే అన్నారు దానిపై విమర్శలు సరికాదు అనే అర్థంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధి ఎవరైనా అభివృద్ధిని కాంక్షించాలని.. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలని పరోక్షంగా పవన్ కు సూచించారు. అటు తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అలీ అభిప్రాయపడ్డారు. తాజాగా అలీ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి : జేసీ ప్రభాకర్ రెడ్డి ఉగ్రరూపం.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్.. ఎందుకంటే..?
అయితే మొన్నటికి మొన్న పవన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని అలీ చెప్పారు. త్వరలోనే తన టాక్ షోకు పవన్ వస్తారని జోస్యం కూడా చెప్పారు. దీంతో వారు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఒకసారి పదవీ బాధ్యతలు చేపట్టిన అలీ.. ఇప్పుడు పవన్ విమర్శించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఈ పదవి చూసుకుని తమ స్టార్ ను విమర్శిస్తారా అంటూ పవన్ అభిమానులు అలీని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan