హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Comedian Ali: ఎట్టకేలకు అలీకి కీలక పదవి.. అయినా అసంతృప్తి వీడలేదా..? పార్టీ మారుతున్నారా?

Comedian Ali: ఎట్టకేలకు అలీకి కీలక పదవి.. అయినా అసంతృప్తి వీడలేదా..? పార్టీ మారుతున్నారా?

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

Comedian Ali: వైసీపీ టాలీవుడ్ పూర్తి దూరం అవుతోందా..? ప్రస్తుతానికి పోసాని, అలీ మాత్రమే వైసీపీతో అధికారికంగా ఉన్నారు. వర్మ కూడా వైసీపీ అనుకూల బ్యాచ్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన వారంతా బయటకు చెప్పకపోయినా దాదాపు దూరమైనట్టే.. ఈ నేపథ్యంలో అలీ కూడా వైసీపీకి దూరం అవుతున్నారని ప్రచారం మొదలైంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయనకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్.. ఈ పదవి ఇచ్చినా అలీ అసంతృప్తిగానే ఉన్నారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Comedian Ali: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలతో బిజీ అయ్యాయి. అయితే ఏ పార్టీ అయినా గెలుపొందాలి అంటే.. టాలీవుడ్ (Tollywood) మద్దతు కూడా అవసరం.. గత ఎన్నికల్లో వైసీపీకి భారీగానే మద్దతు లభించింది.. కానీ ఈ సారి వైసీపీకి ఇంతకాలం మద్దతుగా ఉన్న టాలీవుడ్ కు చెందిన వారు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే కేవలం పోసాని (Posani).. అలీ (Ali) మాత్రమే పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. పార్టీలో యాక్టివ్ గా లేనప్పటికీ.. వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో భేటీ అయ్యారు. ఆ వెంటనే సంచలన నిర్ణయం కూడా ప్రకటించారు.. వ్యూహం అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమాలో జగన్ కు వ్యతిరేకంగా జరిగిన జరుగుతున్న కుట్రలను చూపిస్తారనే ప్రచారం ఉంది. ఈ ముగ్గురు తప్ప బహిరంగంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నవారు ఎవరూ లేరు.

అయితే కమెడియన్ అలీ సైతం వైసీపీకి దూరం అవుతున్నారనే ప్రచారం ఉంది. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారంటూ కథనాలు వినిపించాయి. ఆ వార్తలను అలీ ఖండించినా ప్రచారం ఆగలేదు. ఇలాంటి సమయంలో అలీని పదవి వరించింది. Md Ali

ఎప్పటి నుంచో పదవి ఆశిస్తున్న అలీకి కీలక పదవిని అందించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. దీనిపై అలీ నేరుగా స్పందించనప్పటికీ.. వైసీపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. తనకు జగన్ అప్పజెప్పిన పనులను నియమ నిబంధలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బయటకు ఇలా చెబుతున్నా.. అలీ మాత్రం ప్రస్తుతం పదవి ఆశించే పరిస్థితిలో లేరు అంటున్నారు. అది కూడా తాను ఊహించింది ఇలాంటి సలహదారు పదవి కాదని ఆయన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కేవలం తనలో ఉన్నఅసంతృప్తిని గుర్తించి ఇలాంటి పదవి ఇచ్చారని.. ఆ పదవిపై తాను అంత ఆసక్తిగా లేని సన్నిహితుల దగ్గర చెప్పినట్టు ఓ ప్రచారం ఉంది. అయితే ఇప్పటిలో తాను ఏ నిర్ణయం తీసుకోనని.. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందే.. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు వైసీపీలో ఉండడమే బెటరన్ ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఆ పార్టీ అధ్యక్షుడిపై స్పెషల్ ఫోకస్.. అభ్యర్థిని ఫైనల్ చేసిని సీఎం జగన్.. గెలుపు కోసం పద్మవ్యూహం

అయితే అలీ మాత్రం ఎప్పుడు బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కలేదు.. తాను ఎప్పుడు జగన్ పార్టీలోనే ఉంటానని ఆలీ ఖరాకండీగా చెబుతూ వచ్చారు. అయితే తనకు పదవులు అవసరం లేదని, జగన్ మనసులో స్థానం ఉంటే చాలని ఆలీ ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన మనసులో మాత్ర మరోటి ఉందని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ పదవి బాధ్యతలు స్వీకరించినా.. ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published:

Tags: Ali, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు