Ali on Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలీ మంచి స్నేహితులు.. సీనీ అభిమానులు అందరికీ ఈ విషయం తెలిసింది. పవన్ నటించిన సినిమా (Movie) లలో మెజారిటీ సినిమాలలో అలీ (Ali) కీలక పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. పవన్- అలీ ఇద్దరూ సన్నిహితులే అయినా పవన్ జనసేన పార్టీకి అధినేత అయితే అలీ మాత్రం వైసీపీ (YCP) లో చేరారు. ఈ మధ్యనే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కీలక పదవి చేపట్టారు. అయితే గతంలో ఎప్పుడు పవన్ పై కామెంట్లు చేయని.. అలీ ఈ మధ్య పవన్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. పవన్ విశాఖ టూర్ (Pawan Visakha Tour) నుంచి అలీ విమర్శలు మొదలయ్యాయి. పదవి వచ్చిన తరువాత అలీ గతాన్ని మరిచి.. పవన్ పై విమర్శలు చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
ఇదే సమయంలో అలీ కూతురుకు గ్రాండ్ గా పెళ్లి జరిగింది. అయితే తన కూతురు పెళ్ళికి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి శుభలేఖను అందించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి గాని, రిసెప్షన్ వేడుకకు గాని హాజరు కాకపోవడంతో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి , నాగార్జున, అమల, రోజాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అలీ భార్య జుబేదా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. కీలక నేతలు, స్టార్లు అంతా కనిపించారు కానీ.. అలీ స్నేహితుడు పవన్ అక్కడ కనిపించకపోవడంతో అసలు అలీ ఆహ్వనించలేదా అనే చర్చ జరుగుతోంది.
అయతే అలీ మాత్రం.. తన కూతురు పెళ్ళికి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి శుభలేఖను అందించారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన రిసెప్షన్ కి సీఎం జగన్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి గాని, రిసెప్షన్ వేడుకకు గాని హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇదీ చదవండి : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని వెంటాడుతున్న వివాదాలు.. వారిపై బదిలీ వేటు..!
తాజాగా ఈ విషయంపై అలీ స్పందించాడు.. “పవన్ కళ్యాణ్ కు శుభలేఖ ఇవ్వడం జరిగిందని.. అయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారని. ఆ క్రమంలోనే అయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారని వివరణ ఇచ్చారు. అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారని.. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఫోన్ లో మాట్లాడారని.. వధూవరులు ఇద్దరు ఇంటిలో ఉన్నప్పుడు చెబితే.. తాను వచ్చి కలిసి వధూవరులు ఆశీర్వదిస్తాను అని చెప్పారని వివరణ ఇచ్చారు. అయితే జనసైనికులు మాత్రం అలీ చెప్పేవన్నీ అసత్యాలే అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhra Pradesh, AP News, Pawan kalyan