Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటాయి. భోగీ (Bhgodi) , సంక్రాంతి (Sankranti), కనుమ (Kanuma) మూడు రోజులూ సందడే కనిపించింది. ఇదే సమయంలో కోడిపందాలు (Cockfight), పేకాట, జూదాలు గోవా కల్చర్ (Goa Culture) ను మైమరిపించాయి. నాలుగో రోజు ముక్కనమ సందర్భంగా కూడా కోడి పందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కోడి పందేలు జరిగే సమీప ప్రాంతాలకు కూడా పోలీసులను అధికారపార్టీ నేతలు అనుమతించలేదు. వైసీపీ నేతలు (YCP Leaders) పూర్తిగా బరోసా ఇవ్వడంతో పందెరాయుళ్లు చెలరేగిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 600 కోట్ల రూపాయలు చేతులు మారాయని అంచనా..
కోడి పందెం రాయుళ్లు నెల రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. వన్డే క్రికెట్ మ్యాచ్ లను తలపించేలా బరులు సిద్దం చేసుకున్నారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. 24 గంటలు కోడి పందాలు నిర్వహించడంతోపాటు, లోన బయట పేకాట, గుండాట, మూడుముక్కలాట. మందు, విందు కోరుకునే వారి కోసం కోస్తా రుచులతో రెస్టారెంట్లు వెలిశాయి.
వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారితో భీమవరం, ఉండి, అమలాపురం, సామర్లకోట, రావులపాలెంలో లాడ్జిలు నిండిపోయాయి. చిన్న రూములు కూడా మూడు రోజులకు పాతికవేలు వసూలు చేస్తున్నాంటే పోటీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి : తిరుమలలో వైభవంగా పార్వేట ఉత్సవం.. కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు ప్రారంభం
ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా కోడి పందాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో 25 ఎకరాల్లో బరి ఏర్పాటు చేశారు. ఈ ఒక్క బరిలోనే రూ.100 కోట్ల చేతులు మారాయని అంచనా. కోడి పందాలు వేయడానికి వచ్చిన వారు అక్కడే మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబుపై కుప్పంలో పెద్ది రెడ్డి పోటీ.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
కొందరు కోడి పందాల్లో లక్షలు పోగొట్టుకున్నారు. మరికొందరు గెలుచుకున్నారు. హైదరాబాద్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భారీగా భీమవరం తరలివచ్చారు. ఇక్కడ మూడు రోజులుగా సందడి నెలకొంది. కోడి పందాలకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో పందెరాయుళ్లు రెచ్చిపోయారు. కోడి పందాలను వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : తింటే చేదుగా ఉంటుంది..? కానీ ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
పోలీసులు కూడా చూసిచూడనట్లు వ్యవహరించారు. కోడిపందేలకు పురిటిగడ్డ ఉభయగోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు చెలరేగిపోయారు. ఈ రెండు జిల్లాల్లోనే గడచిన మూడు రోజుల్లో రూ.250 కోట్లు చేతులు మారాయని అంచనా. కోడి పందాల మాటున విజయవాడలో క్యాసినో నిర్వహించారని కలకలం రేగింది.
ఇదీ చదవండి : అక్కడ కోడి పందాలపై పోలీసుల ఉక్కుపాదం.. పదిమంది అరెస్ట్
విజయవాడ రూరల్ విలేజ్ అంబాపురంలో బయట కోడిపందాలు, లోపల క్యాసినో నిర్వహించారు. కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమంతించారు. బౌన్లర్లతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు.
ఇదీ చదవండి : పవన్ కు రెండు అప్షన్లు.. ఆ పని చేయాలి లేదా మా పార్టీలో చేరాలి..?
ఇక ఈ నాలుగు రోజులు ఏపీలో 280 కోట్ల మద్యం తాగారు. కోడి పందాల బరుల దగ్గర మద్యం ఏరులై పారింది. తెలంగాణ నుంచి కూడా భారీగా మద్యం తరలించారు. ఎవరికి ఏ బ్రాండు కావాలంటే ఆ బ్రాండు అందుబాటులో ఉంచారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు నేరుగా బరుల వద్ద దిగడంతో పోలీసులు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gunturu, Sankranti 2023