YSRCP: ఆ కీలక నేతకు ఎమ్మెల్సీ పదవి గ్యారెంటీ..? సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారా..!

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో కీలక పదువుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. శాసన మండలిలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పలుపేర్లను పరిశీలుస్తున్నారు.

 • Share this:
  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో కీలక పదువుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. శాసన మండలిలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పలుపేర్లను పరిశీలుస్తున్నారు. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) నేతలు పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం, అసెంబ్లీలో బలం ఉండటంతో 14 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో వైసీపీలో తీవ్రపోటీ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసిన ఓడిపోయిన నేతలు, ఇతర కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకున్నవారు. పార్టీలో ఉన్న ఇంతవరకు పదవులు పొందని వారు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేశారు. వీరిలో ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

  కాపు సామాజికవర్గానికి (Kapu Caste) చెందిన ఆమంచి జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనం. మాజీ సీఎం రోశయ్య ప్రియ శిష్యుడు కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ హయాంలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమంచి పేరు మార్మోగింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతతో ఉంటూ వారితో కావలసిన పనులు చేయించుకోవడంలో ఆమంచిది అందెవేసిన చేయి.

  ఇది చదవండి: సీఎం సొంత జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి..? రేసులో ఉన్నది వీళ్లేనా..!


  ఐతే గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ తో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినా టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అసలే ఓటమి బాధలో ఉన్న ఆమంచికి తన ప్రత్యర్థి వైసీపికి మద్దతు పలకడం రాజకీయంగా ఇబ్బంది తెచ్చిపెట్టింది. అప్పటినుంచి చీరాలలో ఆమంచి –కరణం బలరాం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలికే ఉద్దేశంతో జగన్, ఆమంచిని పర్చూరు నియోజకవర్గం బాధ్యతలు చూసుకోమని, అవకాశం వచ్చినప్పుడు మండలి సభ్యత్వం కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారనేది ప్రచారం అప్పట్లో జోరుగాసాగింది.

  ఇది చదవండి: సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. విజయసాయిరెడ్డి ఆ పదవికి కత్తెర.. ఆ నేతకు పదవి?  ఐతే అసలే మొండిఘటం అనే పేరున్న ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేక జగన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారనే ప్రచారమూ లేక పోలేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నిక జరగనున్న 14 శాసన మండలి స్థానాలలో స్థానిక సంస్థల కోటాలో ప్రకాశం జిల్లా నుండి ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఐతే ఇప్పటికే చీరాల నుండి పోతుల సునీత మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉండటం, పైగా జిల్లా ఏకైక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో అంతగా సఖ్యత లేకపోవడం, కరణంతో రాజకీయ వైరం ఆమంచికి మైనస్ గా మారిందన్న చర్చ జరుగుతోంది. ఐతే ఇటీవల ఒంగోలుకు వచ్చిన సీఎం జగన్.. ఆమంచికి అభయమిచ్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: