హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించి వారి సేవలకు సలామ్

Good News: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించి వారి సేవలకు సలామ్

వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం (ఫైల్)

వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం (ఫైల్)

Good News: సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉండడంలో ముందు ఉంటానని నిరూపించుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సర్వీస్ నిబంధనలను సడలించి.. ఆయా కుటుంబాలకు మేలు చేస్తూ.. ఫైల్ పై సంతకం చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Good News: సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ది నెంబర్ వన్ స్థానం అనడంలో సందేహం లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ఆయన ముందే ఉంటున్నారు. అందుకు సర్వీస్ నిబంధనలను కూడా సడలించేందుకు వెనుకాడడం లేదు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ (Grama Ward Sachivalayam) ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్‌ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్‌ నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు.

  2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు.

  సీఎం గొప్ప మనస్సు..

  సాధారణంగా సర్వీస్ నిబంధనలను సడలించే ప్రయత్నం ఎవరూ చేయరు.. మరో రూపంలో ఏదైనా చేయాలి అనుకుంటారు. కానీ సీఎం జగన్ .. గతంలో వారికి ఇచ్చిన హామీ ప్రకారం.. కరోనా కష్టకాలంలో వారు చేసిన సేవలను గౌరవిస్తూ.. సర్వీస్‌ నిబంధనలను సడలించి ప్రొబేషన్‌ ఖరారుకు ముందు చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గొప్ప మనస్సుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో కొనియాడింది.

  ఇదీ చదవండి : నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.

  మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌కు సచివాలయాల ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్‌ తేజ్, ఉపాధ్యక్షుడు బీఆర్‌ఆర్‌ కిషోర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  ఇదీ చదవండి : ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడవాహనంపై శ్రీవారు.. విశిష్టతలు ఇవే

  మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రధాన్యతను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాల అండగా ఉంటోంది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 వేలకు పైగా సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులు గుర్తించారు. వాటి వివరాలను కూడా అప్ లోడ్ చేశారు. అందులో 7 వేలకుపైగా పనులను అధికారులు మంజూరు చేయగా.. మరో వేయి పనులను కూడా ప్రారంభించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap grama sachivalayam, Ap welfare schemes

  ఉత్తమ కథలు