హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

లక్ష పెట్టుబడితో ఇంటి నుంచే అధిక లాభార్జన... పేపర్ ప్లేట్ల తయారీలో దూసుకెళ్తున్న బిటెక్ కుర్రాళ్లు

లక్ష పెట్టుబడితో ఇంటి నుంచే అధిక లాభార్జన... పేపర్ ప్లేట్ల తయారీలో దూసుకెళ్తున్న బిటెక్ కుర్రాళ్లు

బీటెక్

బీటెక్ కుర్రాళ్ల పేపర్ ప్లేట్స్ బిజినెస్

సివిల్‌ ఇంజనీరింగ్ చదివారు… కాంట్రాక్ట్‌ వర్క్‌లు చేశారు. కానీ ఇప్పుడు పేపర్‌ ప్లేట్ల బిజినెస్‌లో అడుగుపెట్టి లక్షల్లో అర్జిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు కుర్రాళ్ల విజయగాథ గురించి తెలుసుకుందాం..!

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  సివిల్‌ ఇంజనీరింగ్ (Civil Engineering) చదివారు.. కాంట్రాక్ట్‌ వర్క్‌లు చేశారు. కానీ ఇప్పుడు పేపర్‌ ప్లేట్ల బిజినెస్‌లో అడుగుపెట్టి లక్షల్లో అర్జిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు కుర్రాళ్ల విజయగాథ గురించి తెలుసుకుందాం..! గుంటూరు నగరానికి చెందిన దేరంగుల చిరంజీవి(29), నరసింహరావు (27) ఇద్దరూ అన్నదమ్ములు. సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. చదువు అయిపోయిన తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఉండేవాళ్ళు. తమ తోటి చదువుకున్నవాళ్లంతా మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నా..తాము ప్రస్తుత పోటీ ప్రపంచంలో వెనకపడ్డామని అన్నదమ్ములెప్పుడూ నిరాశ చెందలేదు. నరసింహ, చిరంజీవిల తండ్రి కూడా సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఉండేవారు. తండ్రి బాటలోనే ఇంజినీరింగ్ చదివి తండ్రికి ఆసరా అయ్యారు. సివిల్ ఫీల్డ్‌లో ఒడుడుకులు ఎక్కువ. ఒక్కోసారి భారీగా నష్టాలు చూస్తూ ఉంటారు.

  అలా వస్తున్న నష్టాలకు చెక్ పెట్టేందుకు ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తూనే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ప్రత్యామ్నయ మార్గాలను వెతికారు. ఆర్థికంగా వచ్చే ఎచ్చుతగ్గులను నియంత్రించేలా సొంతంగా ఏదైనా బిజినెస్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అలా బిజినెస్‌ కోసం వారు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.

  ఇది చదవండి: గోల్డ్‌ జ్యూయెలరీకీ నెల్లూరు పెట్టింది పేరు..! కానీ, అక్కడ స్వర్ణకారుల పరిస్థితి మాత్రం..!

  రెగ్యులర్ మార్కెట్‌లో పేపర్ ప్లేట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈకో ఫ్రెండ్లీ పేపర్ ప్లేట్స్ కు మరింత డిమాండ్ ఉందని గమనించారు. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదని తెలుసుకున్నారు. చిన్న పెట్టుబడితో అధిక లాభాలు రాబట్టవచ్చని అర్థమయ్యింది. వెంటనే లక్షన్నర పెట్టుడబడితోవిజయ కనదుర్గ పేపర్ ప్లేట్స్ తయారీనీ ప్రారంభించారు. మార్కెట్‌లో దొరికే వాటికంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి పేరు సంపాదించారు ఈ అన్నదమ్ములు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేస్తున్నామని…దీని వల్ల లేబర్ ఖర్చుకూడా కలిసి రావడంతో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అన్నదమ్ములిద్దరూ.

  ఇది చదవండి: పాయా దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ దొరికే దోశ ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే..!

  అడ్డకులతో చేసిన ప్లేట్లు, సన్‌మైకా( Sunmica), బటర్ పేపర్ వంటి బయో డిగ్రేడబుల్‌ ప్రొడక్ట్స్‌తో ప్లేట్లను తయారు చేస్తూ తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నాన్‌ ప్లాస్టిక్‌ పేపర్‌ ప్లేట్స్‌, విస్తరాకుల ప్లేట్ల తయారీ వీరి ప్రత్యేకత. అన్ని రకాల పేపర్‌ ప్లేట్లు, బఫే ప్లేట్లు వివిధ సైజులలో లభిస్తాయి. వ్యాపారంలో అడుగుపెట్టిన కొన్ని నెలల్లోనే లాభాలబాట పట్టారు. ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించారు ఈ అన్నాదమ్ములిద్దరు. ఇలానే ఐకమత్యంగా మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుందాం..!

  పేపర్‌ ప్లేట్లు అర్డర్ చేయాలంటే వాళ్లకు ఒక్క ఫోన్‌ కానీ, వాట్సప్‌ కానీ చేస్తే చాలు.. మీ ఇంటికి తెచ్చి ఇస్తారు. సంప్రదించాల్సిన నెంబర్ : +91 90006 56842. +91 96667 31153

  అడ్రస్‌: 136-7-393, ఆంజనేయ కాలనీ, వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌-522101.

  Guntur Anjaneya Colony Map

  ఎలా వెళ్లాలి?

  గుంటూరు బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు