హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!

చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!

చీరాల

చీరాల హార్బర్‌లో ఆకట్టుకుంటున్న చేపలు

చీరాల..! ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది స్వాతంత్య్రోద్యమ (Freedom Fight) కాలంనాటి చీరాల-పేరాల ఉద్యమం (Cheerala-Perala Revolution). ఇప్పుడు మరో విషయంలోనూ ప్రాధాన్యత నింపుకొని వందల మందికి జీవనోపాధి కల్పిస్తోందీ ప్రాంతం.

 • News18 Telugu
 • Last Updated :
 • Bapatla, India

  Sumanth, News18, Gunturచీరాల..! ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది స్వాతంత్య్రోద్యమ (Freedom Fight) కాలంనాటి చీరాల-పేరాల ఉద్యమం (Cheerala-Perala Revolution). ఇప్పుడు మరో విషయంలోనూ ప్రాధాన్యత నింపుకొని వందల మందికి జీవనోపాధి కల్పిస్తోందీ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సాగర సంపదను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న ఓడరేవుగా ఆదాయార్జనలో ముందడుగు వేస్తోంది. అదేంటో చూసొద్దాం రండీ..! చెన్నై (Chennai) మార్గంలో విజయవాడ (Vijayawada) నుంచి 101 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు (Guntur) నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉందీ చీరాల మున్సిపాలిటీ. చూడ్డానికి చిన్న పట్టణామే అయినా చేపల విక్రయ కేంద్రంగా వందలాది మంది మత్స్యకారులు, వ్యాపారులకు ఉపాధి కల్పిస్తోంది. చీరాలకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడరేవు నిత్యం క్రయ, విక్రయదారులతో కళకళలాడుతుంది.
  ఏడాది పొడవునా వేలంపాట..!
  చీరాల ఓడరేవుకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఓడరేవుల్లో వారానికి ఒక రోజు లేదా వేటకు వెళ్లొచ్చిన పడవలు వచ్చినప్పుడు మాత్రమే చేపల వేలం పాట జరుగుతుంటాయి. కానీ చీరాలలో మాత్రం రోజూ చేపల వేలం నిర్వహిస్తుంటారు. సూరీడు పొద్దు పొడవక ముందే తీరం వెంబడి సందడి మొదలౌతుంది. ఉదయం 5 గంటల నుంచే మత్స్యకారులు, వ్యాపారులు చేపల వేలానికి సిద్ధం అవుతుంటారు. వేటకు వెళ్లిన పడవల నుంచి జల పుష్పాలను కిందికి దించడం.. వాటిని రకాల వారీగా చేసి వేలం పాటకు సిద్ధం చేస్తారు. అలాగే విడి చేపల విక్రయదారులు, శుభ్రం చేయించి, ఎగుమతి చేసే వ్యాపారులు మరోవైపు సిద్ధమవుతుంటారు. సుమారు 6 గంటల ప్రాంతం నుంచి వ్యాపారం మొదలైపోతుంది.

  ఇది చదవండి: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!


  ఎక్కడికైనా.. ఇక్కడి నుంచే!
  సాధారణ మార్కెట్లలో దొరకని చేపలు ఇక్కడ లభిస్తాయి. చందువ, కండువా, కత్తిసొర, ట్యూనా వంటి చేపలు మన మార్కెట్లలో కనిపించవు. ఐతే ఇక్కడ మాత్రం గుట్టలుగా పోసి వేలం వేస్తుంటారు. ఎక్కువ శాతం వ్యాపారులు వీటిని విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. మార్కెట్లలో దొరకని చేపలు కూడా ఇక్కడ చవకగా దొరకడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు కూడా ఇక్కడ చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.


  వారాంతాల్లో ఓడరేవు మార్కెట్ మరింత రద్దీగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లకు చీరాల నుంచే మత్స్య సంపదను తీసుకు వెళ్తుంటారు. గుంటూరు, విజయవాడలో హోటళ్లలో ట్యూనా చేప తింటే.. అది ఈ ఓడరేవు నుంచే ఇచ్చి ఉంటుందని చెప్పవచ్చు. అస్వాదించే రుచికరమైన చేపలు లభించే చీరాల ఓడరేవును చూసేందుకు వెళ్లిన సరే.. కిలో చేపలైనా కొనడం మర్చిపోవద్దు సుమా!!!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు