హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur Mirchi: డేంజర్ జోన్ లో గుంటూరు మిర్చి.. ఇక ఆ ఘాటు కనిపించదా..?

Guntur Mirchi: డేంజర్ జోన్ లో గుంటూరు మిర్చి.. ఇక ఆ ఘాటు కనిపించదా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

గుంటూరు మిర్చి (Guntur Mirchi) ఘాటు దేశవ్యాప్తంగా ఫేమస్. విదేశాలకు కూడా మన మిర్చి ఎగుమవతువుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం గుంటూరు మిర్చి ప్రమాదంలో పడింది. తెగుళ్లు, వైరస్, నకిలీ విత్తనాలు.. గుంటూరు మిర్చి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

Anna Raghu, Guntur, News18

కొన్నిరకాల పంటలకు.. అవి పండే ప్రాంతంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి పేరుంటుంది. అలాంటి వాటిలో నూజివీడు మామిడి, కోనసీమ కొబ్బరి, కర్నూసు సోనా, కడప చీని ఇలా ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు మంచి గిరాకీ ఉంటుంది. వీటన్నింటికంటే క్రేజ్ ఉన్న పంట గుంటూరు మిర్చి. గుంటూరు మిర్చి ఘాటు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు..  దేశవ్యాప్తంగా ఫేమస్. విదేశాలకు కూడా మన మిర్చి ఎగుమవతువుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం గుంటూరు మిర్చి ప్రమాదంలో పడింది. తెగుళ్లు, వైరస్, నకిలీ విత్తనాలు.. గుంటూరు మిర్చి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. జెమిని వైరస్‌ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. దీనికి తోడు నకిలీ విత్తనాలు అదనపు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

ఎర్ర బంగారం తమ కష్టాలను తీరుస్తుందని భావించి ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను తొలగించే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు మునుపెన్నడూ లేవని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు, తెగుళ్ల నివారణకు కొందరు వారానికి నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో.. ఒకటికి రెండుసార్లు మొక్కలు కొని తెచ్చి నాటుతున్నారు. అయినా ఫలితం లేక వేలాది ఎకరాల్లో మొక్కల్ని తొలగిస్తున్నారు. వీటిని తట్టుకుని పంటను కాపాడుకున్నా.. అధిక వానలతో మొక్కలు చనిపోతున్నాయాని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా కన్పిస్తోంది. ఇక అనంతపురం, కృష్ణా జిల్లాలోనూ తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంది.

ఇది చదవండి: ఒట్టేసి చెబుతున్నా.. మాట తప్పను.. సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా..?


పెరిగిన సాగు విస్తీర్ణం

గతేడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.59 లక్షల ఎకరాల్లో రైతులు మిరప వేశారు. నిరుటి కంటే ఇది 1.11 లక్షల ఎకరాలు ఎక్కువ. గుంటూరు జిల్లాలో 2.41 లక్షలు, ప్రకాశంలో 94 వేలు, కర్నూలు 56 వేలు, కృష్ణా జిల్లాలో 35వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.

ఇది చదవండి: పది రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..


వైరస్ తో కష్టాలు..

వైరస్‌ తట్టుకునే రకాలంటూ.. కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టారు. వీటికి కూడా వైరస్‌ సోకి నష్టపోయామని గుంటూరు జిల్లా రైతులు వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా మిరపలో జెమిని వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉంటోంది. ఇది సోకిన మొక్కల ఆకులు ముడతలుపడి, కుంచించుకుపోతాయి. ఆ మొక్కలను తొలగించడం తప్ప గత్యంతరం లేదు. పలువురు రైతులు పొలాల్ని దున్ని మళ్లీ కొత్తగా మొక్కలు నాటుకునే పరిస్థితి వచ్చింది. వాటికీ తెగుళ్లు సోకడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ వైరస్‌ బారి నుంచి మొక్కలను కాపాడుకున్నా.. కొత్తగా తామర పురుగులు మిరప పంటను ఆశించి, పూతను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీంతో దిగుబడులు భారీగా తగ్గుతాయి. రైతులు వీటిని నల్లి తాకిడిగా భావిస్తూ మందులు కొడుతుండటంతో ఖర్చు పెరుగుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు.

ఇది చదవండి: అఖండ మూవీకి అధికారుల బ్రేక్.. ఏపీలో థియేటర్ సీజ్.. కారణం ఇదే..!


ఖర్చు తడిసి మోపెడు..

ఎకరా మిరప సాగుకు రూ.1.75 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరా రూ.30 వేలకు పైగా కౌలు ముందే చెల్లిస్తున్నారు. విత్తనాలు, దుక్కి, మొక్కల పెంపకం, నాటడం, ఎరువులు, పురుగుమందులు, కలుపుతీతలు ఇతరత్రా ఖర్చులకు కాపు రాక ముందే.. ఎకరాకు రూ.70 వేల వరకు ఖర్చవుతోంది. కోత, అమ్మకం ఖర్చులు క్వింటాలుకు రూ.4వేల పైనే అవుతాయి.

First published:

Tags: Agriculture, Andhra Pradesh, Guntur, Mirchi market

ఉత్తమ కథలు