హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒకే పర్వతం.. నాలుగు అంతస్తులు.. ఏకశిలా విగ్రహం..! ఈ అద్భుతాలను చూసి తీరాల్సిందే..! ఆస్వాదించాల్సిందే..!

ఒకే పర్వతం.. నాలుగు అంతస్తులు.. ఏకశిలా విగ్రహం..! ఈ అద్భుతాలను చూసి తీరాల్సిందే..! ఆస్వాదించాల్సిందే..!

ఉండవల్లి

ఉండవల్లి గుహలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిలో చారిత్రక విశిష్టత కలిసిన ప్రాంతాలున్నాయి. గుంటూరు జిల్లా (Guntur District) లోని ఉండవల్లి గుహలు (Undavalli Guhan).., తెలుగువారందరికి పరిచయం ఉన్న పేరు.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిలో చారిత్రక విశిష్టత కలిసిన ప్రాంతాలున్నాయి. గుంటూరు జిల్లా (Guntur District) లోని ఉండవల్లి గుహలు (Undavalli Guhan).., తెలుగువారందరికి పరిచయం ఉన్న పేరు. అక్కడ ఉన్న గుహాలయాలను చూసేందుకు, శిల్పకళలను ఆస్వాదించడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అదో అద్భుత సృష్టి. ఒక భారీ పర్వత సముదాయాలను ముందు భాగం నుండి తొలచుకుంటూ నాలుగు అంతస్తుల్లో అద్భుతాలను తీర్చిదిద్దారు శిల్పకారులు. ఇక్కడ ఉండవల్లిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఉండవల్లి గుహాలయాలు.. శిల్పకారుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. ఒకే పర్వతాన్ని గుహలు గానూ, దేవతావిగ్రహాలతో ఏకశిలా నిర్మితముగా తీర్చిదిద్దిన శిల్పుల ఘనతను మాటల్లో వర్ణించలేం.., మనస్సుతో ఆస్వాదించాల్సిందే..!

  అబ్బురపరిచే గుహల నిర్మాణాలు..!

  ఇంతటి అద్భుతమైన ఉండవల్లి గుహలు క్రీ.శ 6,7 శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతుంటారు. క్రీ.శ 16వ శతాబ్దం వరకు రాజుల పరిరక్షణలోనే ఉండేవట. ఇక్కడి శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయం చాళుక్యుల కాలం నాటిదని భారతీయ పురాతత్వ సర్వేక్షణ తెలిపింది. ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఈ గుహల మధ్యలో స్తంభాలు.., వాటిపై చెక్కిన అందమైన శిల్పాలు, గుహాంతర్భాగాలలోని గోడలపై చెక్కిన దేవతా విగ్రహాలు ఇలా ఈ గుహలోని ప్రతి ఒక్క కళాఖండం శిల్పకారుల కళానైపుణ్యానికి అద్దంపట్టేవే.

  ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

  విశాలమైన గుహలు, చుట్టూ పచ్చని ప్రకృతి పర్యాటకులను కనువిందు చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న నాలుగు అంతస్తుల్లో ఒక్కో అంతస్తుల్లో ఒక్కో ప్రత్యేకత ఉంది. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి.

  ఇది చదవండి: ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే.. వెయ్యిమంది మునుల తపస్సు ఫలితం పొందుతారు..!

  రెండో అంతస్తులో ఉన్న విగ్రహమే ఈ ఉండవల్లి గుహల్లో ప్రత్యేకమైనది. శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామిగా విగ్రహం ఉంటుంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 25 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తులో ఏక శిలా అనంత పద్మనాభ స్వామి విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శేషపాన్పుతో గుహ అంతర్భాగంలో కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ ఉన్నాయి.

  ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?

  ఇక మూడో అంతస్తులో ఉన్న త్రికూటాలయం ఇంకా పూర్తిగా నిర్మించలేదు. ఈ అంతస్తులో ఎలాంటి విగ్రహాలు లేవు. కింది అంతస్తులోని స్తంబాల మండప నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవిగా ఉండేవి.. తర్వాత క్రమంలో ఇవి గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు హైందవ, బౌద్ధ శిల్ప కళారీతుల సమ్మేళనం. ఈ గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం ఉండేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.

  ఇది చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!

  ఈ ఉండవల్లి గుహల నుంచి మంగళగిరి, కొండవీటి కోటకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. రాజుల కాలంలో ఈ సొరంగ మార్గాల ద్వారానే శత్రువులకు తెలియకుండా సైనాన్యి తరలించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి సొరంగమార్గాలు లేవు..అవన్ని మూతపడిపోయినట్లు సమాచారం.

  ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

  మన చరిత్రను, సంస్కృతి, కళానైపుణ్యాలను నేటి తరానికి తెలియజేసే ఈ అద్భుత కట్టడాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్లి చూడండి. పిల్లలు తప్పకుండా ఆశ్చర్యానికి లోనవుతారు. వాళ్లలో ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

  అడ్రస్‌: ఉండవల్లి గుహలు, పెనుమాక, విజయవాడ రోడ్డు, ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర, ఆంధ్రప్రదేశ్‌-522501.

  Undavalli Caves Maps

  ఎలా వెళ్లాలి..?

  విజయవాడ నుండి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లికి బస్సు మార్గం ఉంది. ఉండవల్లి సెంటర్ నుండి ఆటో ద్వారా వెళ్లొచ్చు. గుంటూరు నుంచి వయా మంగళగిరి మీదుగా ఉండవల్లి సెంటర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు