K. Gangadhar, News18, Guntur
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏప్రియల్ ఒకటి నుండి మార్కెట్ లో అమ్మే ప్రతి బంగారు ఆభరణంపై 6 అంకెల (6 Digit) H.U.I.D హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను ఖచ్ఛితంగా ముద్రించాలి. H U I D నంబర్ తో పాటు షాపు పేరు బంగారం నాణ్యత వంటి అంశాలు నగలపై ముద్రించవలసి ఉంటుంది.
ఐతే అది అత్యంత ప్రయాసతో కూడుకున్నది అంటున్నారు వ్యాపారుల.జిల్లాకి కనీసం ఒక్క హాల్మార్క్ సెంటర్ కూడా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితులలో ఉన్న ఫళంగా ఇలాంటి నియమాలు అమలు చేయాలంటే కష్ట తరమౌతుంది అంటున్నారు వ్యాపారులు. HUID హాల్మార్క్ యంత్రం ఖరీదైనది కావడం వలన చిన్న చిన్న దుకాణదారుల వీటిని ఏర్పాటు చేసుకోవడం కష్టం అంటున్నారు. బంగారు నగల వ్యాపార సంఘం సభ్యులు.
ఇటీవలి కాలంలో బంగారంలో మోసాలపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయనీ.. ప్రజలకు స్వచ్ఛమైన బంగారం అందించడంతో పాటు తూకంలో మోసాలు అరికట్టడం,రాళ్ళ బరువు వేరుగా లెక్కించడం,బంగారం స్వచ్ఛత లో ఖచ్చితత్వం ఉండేలా చేయడమేప్రధాన లక్ష్యం అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.
బంగారం విక్రయాలలో ఎక్కువ శాతం బ్లాక్ మార్కెట్ లోనే జరుగుతాయనేది జగమెరిగిన సత్యం.అడపా దడపా ట్యాక్స్ లు కడుతున్నా అది దేశం మొత్తంలో జరిగే వ్యాపారం లో కనీసం 10% కూడా ఉండదనేది ప్రభుత్వ వర్గాల భావన.దీని వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణ రావలసిన కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబులలోకి వెళుతుందని,బంగారం వ్యాపారాన్ని సరళతరం చేసి మొత్తం బంగారం లెక్కలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం అంటున్నార వ్యాపార వర్గాలు.
ఇక మీదట 2 గ్రాముల బరువు దాటిన ప్రతి బంగారు ఆభరణానికి తప్పని సరిగా హెచ్ యు ఐ డి నంబరు కలిగి ఉండాలని,నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే రెండేళ్ళ జైలు శిక్షతో పాటు నగలను జప్తుచేసి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది.ఐతే ట్యాక్స్ రూపేణా కొంత మేర ధరలు పెరిగినా నాణ్యమైన బంగారం దొరుకుతుందని కొనుగోలు సంతోషం వ్యక్తంచేస్తుంటే,ఇలాంటి నిర్ణయాల వలన తామ వ్యాపారం సన్నగిల్లడంతో పాటు నష్టాల బారిన పడవలసి వస్తుంది అంటున్నారు వ్యాపారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News