Gangadhar, News18, Guntur
పాఠాలు చెప్పే టీచర్లంటే సమాజంలో ఎంతో గౌరవం. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నాయి. తాజాగా బాలికను వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. పల్నాడు జిల్లా (Palanadu District) నరసరావుపేట మండలం రవిపాడు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ నరసింహ మూర్తి విద్యార్థునులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ స్కూల్ వద్ద విధ్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. .రెండు నెలల క్రితం ఉప్పలపడు నుండి రవిపాడు ప్రాథమిక పాఠశాలకు ప్రమోషన్ మీద వచ్చిన నరసింహ మూర్తి ఇలా అసభ్యంగా ప్రవర్తించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించదానికి వెళ్లిన తల్లిదండ్రులతో ఇలాంటివన్నీ ప్రభుత్వ పాఠశాలలో సహజం అంటూ మీకు దిక్కున్నచోట చెప్పుకోమని దురుసుగా ప్రవర్తించారని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.మరో ఉపాద్యాయురాలు రాజేశ్వరి కూడా విధ్యార్ధుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు.
పోలీసులు వచ్చేంత వారికు నరసింహమూర్తిని స్కూల్ నుండి బయటకు పోనివ్వకుండా స్కూల్ కి తాళం వేశారు. గ్రామస్తులు. స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న MEO జ్యోతి.. ఘటన స్థలానికి చేరుకున్నారు. హెడ్ మాస్టర్ నరసింహమూర్తిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.ఉన్నతాధికారుల సిఫారుసు మేరకు వీరిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునన్న పోలీసులు నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News