సంక్రాంతి సందడి అంతా ఇప్పుడు హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గరే కనిపిస్తోంది. పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వాళ్లంతా ఈసారి కొంచెం మందుగానే ప్రయాణమయ్యారు. పెరుగుతున్న కోవిడ్ కేసులు ఓ వైపు , ఆలస్యంగా బయల్దేరితే బస్సులు, ట్రైన్లలో టిక్కెట్లు దొరుకుతాయో లేదోనన్న భయం నగరవాసుల్లో నెలకొంది. ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొనే సొంత ఊళ్లబాట పట్టారు. విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం శనివారం నుంచే సెలవులు ప్రకటించడంతో నాలుగు రోజులు ముందైనా పర్వాలేదు ఊళ్లకు వెళ్తాదమనుకున్న వారు అత్యధికంగా ఉండటంతో జంటనగరాల్లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారితో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్తారు. అలా వచ్చిన వాళ్లతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పండుగ కోసం కొన్ని ప్రత్యేక ట్రైన్లు వేసింది. సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారంతా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోతప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించేలా తగిన ఏర్పాట్లు , జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఎవరైనా మాస్క్ ధరించకపోయినా..సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా వారికి రైల్వే స్టేషన్, బస్తాండ్లలో అవగాహన కల్పిస్తున్నారు.
సంక్రాంతి హడావుడి షురు..
ముఖ్యంగా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు అయితే ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. ఓవైపు ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పిస్తూనే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆయా స్టేషన్లలో చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడే ఇంత రద్దీ ఉంటే ఈనెల 10 తేది తర్వాత ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా జరిగే అవకాశం ఉంది. అలాంటి పొరపాట్లు జరగకుండా నియంత్రించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ఊరి బాట పట్టిన పట్నం వాసులు..
సంక్రాంతి పండుగ ఆంధ్రాలోనే కాదు ఇట తెలంగాణలో కూడా బాగానే జరుపుకుంటారు. అందుకే హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లు ఉత్తర తెలంగాణకు వెళ్లే బస్సులు ఎక్కువగా జూబ్లి బస్తాండ్కు వస్తాయి. కాబట్టి ఉత్తర తెలంగాణకు వెళ్లాల్సిన ప్రయాణికులతో జూబ్లి బస్టాంట్ కిక్కిరిసిపోయింది. పండుగకు వారం రోజుల ముందే ఇంత రష్ ఉంటే..మరో రెండ్రోజుల ప్రయాణికుల సంఖ్య మరింత పెరగవచ్చని ముందుగానే అంచనా వేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పని సరి..
సంక్రాంతికి సొంత ఊళ్లకు, ఆంధ్రాకు వెళ్లే వారిని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇంటి పరిసరాల్లో కొత్తవారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర. కార్లు, బైక్‌ల్లో విలువైన వస్తువు పెట్టుకోవద్దన్నారు. ఇళ్లలో లైట్ వేసి ఉంచాలన్నారు. డోర్‌కి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడంతో పాటు పాలవాళ్లు, పేపర్ బాయ్‌ని ఈ పండుగ రోజుల్లో రావద్దని చెప్పమని సూచించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Buses, Passenger traffic, Train