Home /News /andhra-pradesh /

GUNTUR BOY SHAIK RASHEED PROVED HIS TALENT IN U 19 CRICKET WORLD CUP AS HE AIMED TO WEAR TEAM INDIA JERSEY SOON FULL DETAILS HERE PRN GNT

Shaik Rasheed : టీమిండియాలో గుంటూరు మిర్చిలాంటి కుర్రోడు.. రైజింగ్ స్టార్ గా షేక్ రషీద్..

షేక్ రషీద్ (Photo Credit: Facebook)

షేక్ రషీద్ (Photo Credit: Facebook)

Under-19 Cricket World Cup: ఓ చిన్న గ్రామంలో పుట్టిన కుర్రాడు.. ఏకంగా దేశానికి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అందేకాదు టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్ కూడా అయిపోయాడు. ఇండియన్ క్రికెట్ రైజింగ్ స్టార్స్ లో ఒకడుగా నిలిచాడు.

    Anna Raghu, Guntur, News18

    గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు క్రికెట్ (Cricket) అంటే ఊరిచివర గ్రౌండ్. ఇక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే టీవీల్లో చూడటమే తప్ప.. ఆటడం అనే ఆలోచనే రాదు. కనీసం క్రికెటర్లను ప్రత్యక్షం చూడాలన్న కల కూడా నెరవేరదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన కుర్రాడు.. ఏకంగా దేశానికి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అందేకాదు టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్ కూడా అయిపోయాడు. ఇండియన్ క్రికెట్ రైజింగ్ స్టార్స్ లో ఒకడుగా నిలిచాడు. అంతడే భారత అండర్-19 క్రికెట్(Under-19 Cricket) జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్. అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ఈ గుంటూరు కుర్రోడు ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతున్నాడు.

    గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లయ్యపాలెంలో జన్మించిన షేక్ రషీద్.. టీమిండియా అండర్-19 ప్రపంచకప్ గెలవడోం కీలక పాత్రపోషించాడు. ముఖ్యంగా ఆస్ట్రేయిలాతో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓపెనర్లు వెంటనే వెంటనే ఔట్ సమయంలో క్రీజ్‌లోకి వచ్చి.. 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లండ్ తో జరిగిన ఫైన్ మ్యాచ్ లోను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కీలకదశలో చేసిన ఈ హాఫ్ సెంచరీ టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలవడంలో కీలకంగా నిలిచింది.

    ఇది చదవండి: రెండు చేతులు.. 21 భాషలు.. ఈమె రాయడం మొదలుపెడితే రికార్డుల మోతే..!


    రషీద్ ది చాలా సామాన్య కుటుంబం. తండ్రి ఓ బ్యాంక్ ఉద్యోగి. ఏడేళ్ల వయసులోనే అతను బ్యాట్ పట్టాడు. తొమిదేళ్లకే అండర్-14లో అరంగేట్రం చేశాడు. అంతర్ జిల్లాల పోటీల్లో 12 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-16 టోర్నీలో సత్తా చాటి.. భారత అండర్-19 వరల్డ్ కప్‌ కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు.

    ఇది చదవండి: అదృష్టం వలకు చిక్కడం అంటే ఇదే.. మత్స్యకారుడికి ఊహించని లాభం


    తన కొడుకు మంచి క్రికెటర్ కావాలనేది తన కోరిక అని రషీద్ తండ్రి తండ్రి బాలీషా వలీ అంటున్నారు. తాను టీమిండియాకు ఆడాలని అనుకునేవాడిని అని.. అయితే తనకున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదన్నారు. తన కొడుకు ద్వారా తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని బాలీషా వలీ చెబుతున్నారు. ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసే తాను.. కుమారుడి కోచింగ్ కోసం ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు చెప్పారు. అయితే 2015, 2016లో రషీద్ ఆట లయ తప్పిందని.. అయినా వెంటనే గాడిలో పడినట్లు తెలిపారు.

    ఇప్పటివరకు 8 ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్ చేసిన రషీద్.. 55.6 సగటుతో 334 రన్స్ చేశాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ రషీద్ దుమ్ములేపాడు. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 90 రన్స్, శ్రీలంకపై 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై అర్ధసెంచరీతో సత్తా చాటిన రషీద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. త్వరలో జరిగే ఐపీఎల్ వేలంలో రషీద్ కు మంచి డిమాండ్ రావొచ్చు. అలాగే టీమిండియాకు ఆడాలనే తన కలను త్వరలోనే చేరుకుంటానని రషీద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cricket, Guntur, ICC Under 19 World Cup

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు