GVL: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (Gvl Narasimah Rao) గురించి తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఆయన సుపరిచితమే.. కేంద్రం తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ఏకైక నేత ఆయనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో బీజేపీ (BJP) అంత బలంగా లేకపోయినా.. ఆయన మాత్రం నిత్యం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అటు తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా నరసింహారావుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక ఆవుకు నమస్కరించే ప్రయత్నం చేస్తున్నా సమయంలో ఊహించిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరులోని మిర్చి యార్డ్ లో ఇది చోటు చేసుకుంది. అక్కడ ఎగుమతిదారుల అసోసియేషన్ కార్యాలయం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జీవీఎల్ వచ్చారు. అలాగే కార్యాలయం ప్రారంభోత్సవం కోసం అసోసియేషన్ వారు ఒక ఆవును తీసుకొచ్చారు.
అలా వచ్చిన ఆవుకు.. ఈ సందర్భంగా నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను తన్నింది. అయితే పెద్దగా దెబ్బ ఏమీ తగల్లేదు. మరోసారి మొక్కేందుకు ప్రయత్నించగా అది మరోసారి కాలు లేపింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఎందుకు అలా ప్రతి సారి తన్నేందుకు ప్రయత్నిస్తుండడంతో.. ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
@BJP4India RS member GVL Narasimha Rao today has an oops moment as a cow tried to kick him as he tried to approach it twice to conduct ‘gau puja’ at the chilli market yard in Guntur. He was at the yard to inaugurate new office building of chillies ????️ exporters assn of India. pic.twitter.com/k0TLpoXhDL
— SNV Sudhir (@sudhirjourno) December 10, 2022
తాజాగా గుంటూరు మార్కెట్ యార్డు (Guntur Market Yard) సంఘటన పై ఎంపీ జీవీఎల్ స్పందించారు. ఇది చాలా చిన్న సంఘటన అని ఆయన చెప్పుకొచ్చారు. ఆవు పెద్ద గుంపును చూసి భయపడి తనపై కాలు విసిరిందన్నారు. తన కుర్తాను పాడు చేసిందని చెప్పారాయన. దీన్ని పొరపాటున దాడిగా అభివర్ణిస్తున్నారని, తనను నిందిస్తే ఎటువంటి సమస్యా లేదని, కానీ పవిత్రమైన ఆవును నిందించొద్దన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఇదీ చదవండి : వర్షంలోనూ తగ్గదేలే అంటున్న మంత్రి రోజా .. ఇంటింటికీ వెళ్తూ.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం
మరోవైపు ఆయన తెలంగాణ లో రాజకీయ పరిస్థితిపైనా మాట్లాడారు.. గుజరాత్ లో సాధించినట్టే 2024లో తెలంగాణలో బీజేపీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడానికి సిద్ధంగా ఉంది అన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు ఇక కాలం చెల్లింది అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Guntur, GVL Narasimha Rao