ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Devlopment Scam) కేసు కీలక మలుపు తిరుగుతోంది. త్వరలోనే పెద్దస్థాయి అరెస్టులు తప్పవు అంటూ ప్రచారం జరుగుతోంది. ఊహించినట్టే ఏపీకలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మరో మలుపు చోటు చేసుకుంది. ఏపీఎస్‌డీసీ ఎండీ (APSDC MD) గా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జా (Srikant Aarja) కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 330 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో సీఐడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. అవినీతి సొమ్మును రాబట్టడమే తన లక్ష్యమంటున్నారు సంస్థ చైర్మన్ అజయ్‌రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా 330 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. నాటి సంస్థ ఎండీ శ్రీకాంత్ అర్జాను విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ ఇష్యూ మరోసారి రాజకీయ మంటలకు దారితీసింది. లోకేష్‌ను నేరుగా టార్గెట్ చేసి.. వైసీపీ నేతలు ఇటీవల విమర్శల దాడి పెంచుతున్నారు. ఈ స్కామ్ ప్రధాన సూత్రదారి నారా లోకేష్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే రాజకీయ కక్షలో భాగంగానే ఇలా వైసీపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మరల్చడానికి ఇలా లేని కేసులను రుద్దే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతే.. సీమెన్స్‌కు ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించారని చెప్తున్నారాయన. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంగా కొట్టిపారేశారు అచ్చెన్నాయుడు.
ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు.. టీడీపీతో జత కట్టిన లెఫ్ట్ పార్టీ.. జనసేన ..?
అసలు ఈ కేసు ఏంటంటే..?గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు అప్పటి ప్రభుత్వం చేపట్టింది. ఆ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం 10శాతం చెల్లింపులు చేసింది. మిగతా 90 శాతం సీమెన్స్ చెల్లించకుండా.. సర్కార్ సొమ్మును సైతం షెల్ కంపెనీలకు మళ్లించారన్నది అభియోగం. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు 240 కోట్లు రూటింగ్ అయిందంటున్నారు సంస్థ ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి. సీమెన్స్ ఓ ఇంటర్నేషనల్ కంపెనీ. తమ పేరుతో కొందరు మోసానికి పాల్పడ్డారని ఆ సంస్థ చెప్పిందని అజయ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి : జగన్‌పై దాడిచేసిన ఆ ‘కోడి కత్తి’ ఎక్కడుంది? NIA కోర్టు సంచలన ఆదేశాలు
2016-18 మధ్య మొత్తం స్కాం జరిగిందని.. ఈ కుంభకోణంలో గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేశారు విజిల్ బ్లోయర్.. వెంటనే అసలు ఫైళ్లను చంద్రబాబు ప్రభుత్వం మాయం చేసినట్టు విమర్శలు ఉన్నాయి.. అధికారులను మేనేజ్ చేసే సమయంలో.. కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో విషయం బయటపడింది అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh