Anna Raghu, News18, Amaravati
Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయలు శరవేగంగా మారుతున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మూడు కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బిజీ అయ్యాయి. ఇదే సమయంలో వలసలు కూడా ఊపందుకుంటున్నాయి. అయితే అన్ని పార్టీలు చెప్పే మాట ఒకటే.. త్వరలో తమ పార్టీలోకి వలసలు ఉంటాయని అంటున్నారు. అధికార వైసీపీ(YCP)సైతం అదే మాట చెబుతోంది. ఇక ప్రధాన ప్రతిక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అయితే.. భారీగా వైసీపీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. త్వరలోనే వారందరూ చేరుతారంటూ ప్రచారం చేస్తున్నారు.. బీజేపీ నేతలు (BJP Leaders) సైతం టీడీపీ, వైసీపీల నుంచి కూడా చాలామంది తమతో టచ్ లో ఉన్నారి చెబుతున్నారు. మరోవైపు జనసేన (Janasena) లోకి కూడా కొంతమంది కీలక నేతలు వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలు చెబుతున్నది ఎంత వరకు నిజమన్నది ఎన్నికలకు సమయం దగ్గర పడితే కానీ చెప్పలేం.. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినా.. నేతలు అయైనా... పార్టీ మారడం అంత ఈజీ కాదు.. పార్టీలో కష్టాలు ఉన్నా.. వాటికి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్పా.. అధికారం వదులుకునే సాహసం చేయరు..
ఎన్నికల ముందు మాత్రం ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా వలసలు ఉండే అవకాశం ఉంది. ఏ పార్టీ వేవ్ జనాల్లో బాగా ఉందని అంచనా వేస్తారో ఆ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే తాజా ఓ ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా (Prakasam District)కు చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు.. అందులో ఒక ఎమ్మెల్యే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ను వ్యక్తిగతంగా హైదరాబాద్ లో కలిసినట్లు.. జనసైనికుల్లో ప్రచారం ఉంది. వారిద్దరూ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వీరాభిమానులమని చెప్పుకునేవారు. అలాంటివారు ఇప్పుడు పవన్ కలిశారనే ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.
పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత? రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీపై ప్రజల్లో అంతర్గతంగా వ్యతిరేకత ఉందనేది వీరిద్దరి అభిప్రాయం అంటున్నారు. అందులోనూ సీఎం జగన్ (CM Jagan) పదేపదే గ్రాఫ్ పెంచుకోమని చెప్పడం.. కొత్త వారిని ప్రోత్సహిస్తుండడం కూడా వారికి ఇబ్బంది మారిందని.. ఎమ్మెల్యేలకు నిధులు.. అధికారాలు ఇవ్వకుంటే.. గ్రాఫ్ ఎలా పెరుగుతుందనే అభిప్రాయంలో వారున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేతో పాటు మరో కీలక నేత పార్టీ మారడం ఒక్కటే సరైందనే అంచనాకు రావడంతో వీరు పవన్ కలిసినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట ఒక్కటే.. రాష్ట్ర వ్యాప్తంగా తన గ్రాఫ్ బాగుందని.. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం బాగులేదు అంటున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. అధిష్టానం తీరు కారణంగానే తమపై వ్యతిరేకత పడుతోందని అంచనా వేస్తున్నారు. దాదాపు చాలా వర్గాల్లో పాలనపై వ్యతిరేకత ఉందని.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు.. కొన్ని సామాజిక వర్గాలకు జగన్ పాలనపై అసహనంతో ఉన్నారని.. ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలి అంటే.. పార్టీ మారడమే సరైన చర్య అని వారు భావిస్తున్నట్టు ప్రచారం ఉంది.
అంతేకాదు వారిద్దరూ పవన్‌కల్యాణ్‌ను కలిసి వచ్చిన తర్వాత వీరి వ్యవహారాల్లో కూడా మార్పులు వచ్చాయని చెబుతున్నారు. వారి వారి సామాజికవర్గాలవారికే పనులు చేస్తున్నారని, ఇతరులు ఎవరైనా వెళితే ముఖ్యమంత్రి జగన్ ను చూసి ప్రజలు ఓటువేశారని, మమ్మల్ని చూసి ఓటేయలేదని, కాబట్టి జగన్ దగ్గరకే వెళ్లి పనిచేయించుకోవాలని చెప్పి పంపిస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారి కష్టాలు ఫేస్ చేయడం కంటే.. ఎన్నికల సమయం వరకు అధికారంలోనే ఉండి.. ఈ లోపు తమ పునాదిని పటిష్టం చేసుకొని, తమ తమ సామాజికవర్గాలవారికి న్యాయం చేసుకొని ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లినా తమకు గెలుపు తథ్యమని అనుకున్నతర్వాతే పార్టీ మారతారని తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగాన కర్చీఫ్ వేసి ఉంచితే.. వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Prakasam, Ycp