Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh) రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బిజీ అయితే.. ఎమ్మెల్యేలు, ఆశావాహులు అంతా సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అధికార వైసీపీ (YCP) కి ఈ సారి వర్గ పోటు తప్పడం లేదు. దాదాపు చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడే పరిస్థితి ఉంది. ఈ సారి సిట్టుంగుల్లో చాలామందికి సీటు కష్టమే అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో సలు సార్లు సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. అప్పుడే క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.. దాదాపు 40 మందికి పైగా సిట్టుంగులు తమ గ్రాఫ్ పెంచుకోకుంటే సీటు లేదని వారి మొహం మీదే చెప్పేశారు అంటున్నారు. దీంతో ఆయా సీట్లలో ఆశావాహులు తమ ప్రయత్నాలు పెంచారు.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబుకి కూడా షాక్ తప్పదా అనే ప్రచారం ఉంది.
ఆయన్ను సత్తెనపల్లి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా..? సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. సత్తెనపల్లిలోని మాజీ గ్రంథాలయ చైర్మన్ చిట్టా విజయ భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అంబటి సీటుకు గట్టిగానే పోటీ కనిపిస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయినా ఇప్పటి నుంచే సత్తెనపల్లి అంబటి సీటుకు అసమతి సెగలు గట్టిగానే తాకుతున్నాయి.. ఆయన వ్యతిరేక వర్గ నేత తాజాగా
సత్తెనపల్లి సీటు విషయంలో అధిష్టానాన్ని కలుస్తానని చెప్పటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అంబటి కి సీటు వద్దంటూ రెడ్డి సామాజిక వర్గం అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. అయితే అప్పటికి అంబటిపై మంచి ఇమేజ్ ఉండడడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. ఆయనపై పలు రకాలు ఆరోపణలు వస్తున్నాయి. తనకు కేటాయించిన శాఖపైనా పట్టు సాధించలేదని.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో ఫెయిల్ అయ్యారని ప్రచారం ఉంది. దీనికి తోడు ఇటీవల ఆయన పై ఆడియో కాల్స్ వ్యవహారం మరింత వ్యతిరేకత పెరిగింది.
ఇదీ చదవండి : స్పీకర్ మంత్రి అవుతారా..? మంత్రి స్పీకర్ అవుతారా..? ఏపీ కేబినెట్ లో మార్పులు ఇవే..?
ఈ కారణాలను ప్రధానంగా హైలైట్ చేస్తూ.. అంబటికి మళ్లీ టికెట్ లేకుండా చేయాలని ప్రత్యర్థి గ్రూపు ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా.. సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో 4,000 మందితో కార్యకర్తలతో వైయస్సార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చర్చిస్తాం.. ఆత్మీయ సమావేశంలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర సమాజిక వర్గాల నుంచి కూడా భారీగా పాల్గొంటారని ఊహాగానాలు జరుగుతున్నాయి.. వైసీపీ క్యాడర్ లో అంబటి తో సమన్వయ లోపం ప్రధానకారణం అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, AP Politics