Breaking News: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) విషయంలో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సర్కార్ కు సుప్రీం కోర్టు (Supreme Court) సీజేఐ షాకిస్తే.. అమరావతి రైతులకు (Amaravati Farmers) ఏపీ హైకోర్టు (AP High Court)తీర్పు షాకిచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. రైతులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు.. తాము ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని రైతులకు తేల్చి చెప్పింది న్యాయస్థానం.. ధర్మాసనం ఇచ్చిన షరతులకు లోబడే పాదయత్ర జరగాలని స్పష్టం చేసింది.. పాదయాత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభావం తెలపొచ్చు అని సూచించింది.. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులు వచ్చినప్పుడు చూపించాలని రైతులకు ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.. మరోవైపు.. పాదయాత్ర రద్దు చేయాలంటూ డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కూడా కొట్టివేసింది హైకోర్టు.
ఒకవేళ హైకోర్టు ఇచ్చిన షరతులను రైతులు మళ్లీ ఉల్లంఘిస్తే.. అప్పుడు యాత్ర రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి స్పష్టం చేసింది.. ఇదే సమయంలో కోర్టు ఆదేశాలను ఎట్టిపరిస్ధితులలో ఉల్లంఘించరాదని రైతులను హెచ్చరించింది.
అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని లాయర్లు కోరడం.. రైతులు 600 మంది మాత్రమే పాల్గొంటారని చెప్పిన పిటిషనర్లు, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని కూడా కోర్టుకు విన్నవించారు.. మొన్న వాదనలు ముగించి తీర్పు వాయిదా వేసిన హైకోర్టు.. ఇవాళ్ల తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి : జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకంటే?
హైకోర్టు తాజా ఆదేశాలతో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.. ఇప్పటికే రాజధాని రైతులు తమ పాద యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తాజా తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఓ సమావేశంలో చర్చించిన తరువాత.. పాదయాత్ర తిరిగి ప్రారంభించాలా.. వద్దా అన్నదానిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : ఆకతాయిల పనా? షార్ట్ వీడియోల కోసం చేశారా? కుట్ర ఉందా? శబరి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు
తాజా కోర్టు తీర్పు ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించారు అనిపిస్తే.. రద్దు చేయాలని కోర్టును డీజీపీ కోరవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అధికార పార్టీ నేతలు తమ పాదయాత్రపై కుట్రలు చేసి.. అల్లర్లు జరిగేలా ప్లాన్ చేసే అవకాశం ఉందని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. అందుకే భవిష్యత్తుపై పూర్తిగా న్యాయపరమైన సలహాలు తీసుకున్న తరువాతే ముందు అడుగు వేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP High Court, AP News