Andhra Pradesh: సంగం కేసులో ఏసీబీకి చుక్కెదురు? ధూళిపాళ్ల విచారణకు బ్రేక్ వేసిన ధర్మాసనం

ధూళిపాళ్ల నరేంద్ర (ఫైల్)

సంగం డెయిరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. దీంతో విచారణను మధ్యలో ఆపి తిరిగి సెంట్రల్ జైలు తరలించారు అధికారులు..

 • Share this:
  సంగం డెయిరీ కేసులో ఏసీబీకి చుక్కెదురైంది. విచారణ కొనసాగుతుండగానే ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. విచారణను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ మధ్యలోనే విజయవాడ జిల్లా జైలు నుండి రాజమండ్రి సెంట్రల్  జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు. ఈ కేసులో ఐదు రోజుల  పాటు విచరాణ అవసరం లేదని హైకోర్టులో హౌస్ మోషన్ ధాఖలు చేశారు ధూళిపాళ్ల తరపు న్యాయవాదులు. ధూళిపాళ్ల నరేంద్ర తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు..  ఏసీబీ విచారణకు బ్రేకు వేసింది.

  అయితే అంతకుముందు గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టు అయిన టీడీపీ సీనియర్‌ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ కస్టడీకి తీసుకుని విచారించారు. ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో భాగంగా తొలిరోజు సుమారు 5 గంటలకుపైగా విచారణ జరిపారు. సంగం డెయిరీ కార్యకలాపాలు, ఛైర్మన్‌గా నరేంద్ర బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు? అంతకుముందు తన తండ్రి హయాంలో ఎన్ని సంవత్సరాలు డెయిరీ కార్యకలాపాలు సాగించింది?.. తదితర అంశాలపై తొలిరోజు ప్రాథమిక దర్యాప్తు జరిపినట్లు తెలుస్తోంది.

  మరోవైపు కోర్టు తీర్పునకు ముందు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం దగ్గర, విజయవాడలోని గొల్లపూడి ఏసీబీ కార్యాలయం దగ్గర నరేంద్రను చూసేందుకు అతని కుటుంబ సభ్యులు, అభిమానులు తరలివచ్చారు. నరేంద్ర తల్లి ప్రమీలాదేవి, భార్య జ్యోతిర్మయి, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు నరేంద్రను చూసేందుకు వచ్చారు. కానీ ఆయన్ను కలిసేందుకు పోలీసులు వారిని అనుమతించలేదు. గంటల తరబడి బయట నిరీక్షించినా ఒక్క నిమిషం కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగం డెయిరీ లావాదేవీలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తన భర్తను ఇరికించేందుకు ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని  ఆమె అభిప్రయాపడ్డారు.

  ధూళిపాళ్ల నరేంద్రను సీఎం జగన్ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి తెలిపారు.నిజంగా అక్రమాలు జరిగి ఉంటే విచారణ తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పారు. ముందే లోపలకు పంపి తమను క్షోభకు గురిచేస్తున్నారన్నారు. భూమి బదలాయింపు 1994లో జరిగింది.. అప్పుడు ఎందుకు ఈ కేసు తెరమీదకు తీసుకురాలేని ఆమె ప్రశ్నించారు. ఆ భూమిని తమ సొంత పనికి తీసుకోలేదని చెప్పారు. అందరికీ ఉపయోగపడేలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆస్పత్రి కట్టారని చెప్పారు. కనీసం ఒకసారి తన కొడుకుని చూడనివ్వకుండా జెట్‌స్పీడ్‌లో తీసుకెళ్లారని ప్రమీలాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
  Published by:Nagesh Paina
  First published: