హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ration Card: మీ రేషన్ కార్డు తీసేశారా? ఇలా చేస్తే మళ్లీ కొత్తది వస్తుంది.. ఎలా అప్లై చేయాలి?

Ration Card: మీ రేషన్ కార్డు తీసేశారా? ఇలా చేస్తే మళ్లీ కొత్తది వస్తుంది.. ఎలా అప్లై చేయాలి?

కొత్త రేషన్ కార్డ్ కు ఇలా అప్లై చేసుకోండి

కొత్త రేషన్ కార్డ్ కు ఇలా అప్లై చేసుకోండి

New Ration Card: మీ రేషన్ కార్డు తీసేశారా..? అర్హత ఉన్నా మీకు రేషన్ కార్డు లేదా.. అయితే ఇలా చేస్తే మళ్లీ కొత్త కార్డు పొందే అవకాశం..? రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

New Ration Card: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామన్యులకు, పేదలకు మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం.. ఏదైనా కారణంతో మీ కార్డు రద్దైందా..? అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటి వరకు రేషన్ కార్డు (Ration Card) లేకుండా ఉన్నారా..? ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డుకు అప్లై చేయలేదా.. అలాంటి వారి అందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్  కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.  రాష్ట్రంలో అనర్హత కారణంగా రైస్ కార్డు కోల్పోయినవారు.. నిజంగా అర్హులు అని భావిస్తే..  సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మళ్లీ కొత్త కార్డు పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి  కొత్తకార్డు మంజూరుకు ఫౌర సరఫరాల శాక (Civil Supply Department) అవకాశం కల్పించింది.  ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో (Grama Ward Sachivalayam) స్ల్పిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. వీరితో పాటు.. ఒంటరి వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చింది. అంతే సంతానం లేకుండా ఉన్నవారు.. విడాకులు తీసుకున్న వారికి కూడా ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సచివాలయానికి వెళ్లి కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి.. లేదా..? వాలంటీర్ ను అయినా సంప్రదించాలి..

కొత్త రైస్ కార్డుకు ఎలా అప్లై చేయాలి అంటే..?

గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటి వరకు రైస్ కార్డు e-KYC ను AEPDS మొబైల్ అప్లికేషన్ లో చేసే వారు. కానీ గత కొంత కాలం గా రైస్ కార్డు లు సచివాలయం లో ఆన్లైన్ అవుతున్నప్పటికి eKYC చేయు మొబైల్ అప్లికేషన్ AEPDS సరిగా పని చెయడం లేదని అంటున్నారు. దీంతో కొత్తగా GSWS డిపార్ట్మెంట్ వారు రైస్ కార్డుల eKYC కొరకు వాలంటీర్లు హౌస్ హోల్డ్ మాపింగ్ కోసం ఉపయోగిస్తున్న GSWS Volunteers (గతం లో గ్రామ వార్డు వాలంటీర్) లో కొత్తగా ఆప్షన్ ఇస్తున్నారు. మీ వాలంటీర్ ను సంప్రదించి.. ప్రోసెస్ చేసుకోవాలి.

అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి అంటే వాలంటీర్ల ఆధార్ నెంబర్ తో అవ్వాలి. గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్న ఆధార్ నెంబర్ తో మాత్రమే లాగిన్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్ వారికి లాగిన్ అవ్వక పోతే అప్పుడు వారి వివరాలు MPDO/MC వారి apgv.apcfss లాగిన్ లో అప్డేట్ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతుంది. లేకపోతే "AADAR NOT REGISTERED WITH THE DEPARTMENT" అని వస్తుంది.

ఇదీ చదవండి : వేళాంగిణీ మాతా చర్చ్‌ కోసం తమిళనాడు వరకు వెళ్లక్కర్లేదు..! ఒక్కసారి ప్రార్ధిస్తే కోరికలు తీరుతాయని నమ్మకం

అయితే ఈ కొత్త కొత్త ప్రాసెస్ లో మొత్తం మూడు రకాల రైస్ కార్డు సర్వీస్ అందుబాటులో ఉంటున్నారు. అందులో ఒకటి ఈ కేవైసీ ఉంటుంది. రెండోది చైల్డ్ డిక్లరేషన్, మూడోది డెత్ డిక్లరేషన్ ఉంటాయి. మార్పులు చేర్పులు ఉంటే దీని ద్వారా చేసుకోవచ్చు.

ఇదీ చదవండి : అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం.. ఈ రోజు దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసా?

ఈ అప్లికేషన్ కోసం..వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.

హోమ్ పేజీ లో "సేవల అభ్యర్థన" అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. తరువాత రైస్ కార్డు ఈ కేవైసీను ఎంచుకోవాలి. ఇక సెర్చ్ అప్లికేషన్ లో టి నెంబర్ ఉంటే.. అప్లికేషన్ నెంబర్ లేదా..? రైస్ కార్డు నెంబర్ ఉండాలి.. ఇక రెండోది.. రైస్ కార్డు నెంబర్ ను ఎంచుకిని సబ్ మిట్ చేయాలి. తరువాత పెండింగ్ అని ఉన్న దానిపై క్లిక్ చేయాలి.. అలాగే EKYC,CHILD EKYC, DEATH లో ఒకటి ఎంచుకోవాలి. తరువాత కండిషన్స్ అనే బాక్స్ టిక్ చేయాలి.. ఆ తరువాత బయో మెట్రిక్ లేదా ఐరిష్ తో అథెంటికేషన్ చేస్తే.. మీ అప్లికేషన్ పూర్తి చేయాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Ap welfare schemes, Ration cards

ఉత్తమ కథలు