GUNTUR BHARATIYA JANATHA PARTY DEMANDS TO CHANGE NAME OF GUNTUR ZINNAH TOWER AND MUSLIM LEAGUE SLAMS BJP FULL DETAILS HERE PRN GNT
AP BJP: మరో రచ్చకు తెరలేపిన ఏపీ బీజేపీ.., గుంటూరుకి పాకిస్తాన్ కు లింక్.. జిన్నా టవర్ పై వివాదం..
గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బీజేపీ (BJP) రచ్చ కొనసాగుతూనే ఉంది. జనాగ్రహ సభతో సీఎం జగన్ (AP CM YS Jagan) పై, లిక్కర్ పాలసీపై సంచలన ఆరోపణలు చేసిన ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడు గుంటూరు కు పాకిస్తాన్ కు లింక్ పెట్టారు. గుంటూరు లోని జిన్నా టవర్ పేరు మార్చాలని.. లేదంటే కూల్చివేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బీజేపీ (BJP) రచ్చ కొనసాగుతూనే ఉంది. జనాగ్రహ సభతో సీఎం జగన్ (AP CM YS Jagan) పై, లిక్కర్ పాలసీపై సంచలన ఆరోపణలు చేసిన ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడు గుంటూరు కు పాకిస్తాన్ కు లింక్ పెట్టారు. గుంటూరు లోని జిన్నా టవర్ పేరు మార్చాలని.. లేదంటే కూల్చివేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. సత్యకుమార్ కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట కలిపారు. హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇదే డిమాండ్ ను లేవనెత్తారు. వీళ్లందరికంటే ఓ అడుగు ముందుకు వేసిన రాజా సింగ్.. ప్రభుత్వం గనుక జిన్నా టవర్ పేరు మార్చకుంటే కూల్చివేస్తామని హెచ్చరించారు.
జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిన్నా అనే వంటి వ్యక్తి దేశ విభజనకు కారకుడయ్యాయడని.. ఆ సమయంలో అనేక మంది భారతీయులు ఊచకోతకు గురయ్యారని.. జిన్నా కారణంగా ఇప్పటికీ భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి సమయంలో గుంటూరులో జిన్నా సెంటర్ కు ఆ పేరు తొలగించాలన్నారు. ఆ సెంటర్ కు అబ్దుల్ కలాం పేరు లేదా జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అలాంటి వారి పేరుతో ప్రాంతాలుంటే తొలగించాలని సోము వీర్రాజు కోరారు. ఏపీలోని జిన్నా టవర్ కు దేశద్రోహి అయిన మహ్మద్ అలీ జిన్నా పేరు ఎందకు పెట్టారని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ స్థూపానికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ముస్లీం లీగ్ ఎమంటోందంటే..!
బీజేపీ నేతల వ్యాఖ్యలను ముస్లిం లీగ్ ఖండించింది. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలచిన జిన్న టవర్ ను కూల్చివేస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టేనని.. జిన్నా నిజమైన దేశభక్తుడని ముస్లిం లీగ్ నేతలన్నారు. బీజేపీ నాయకులకు స్వాతంత్ర్యం సమరంలో స్థానం లేదు కనకనే ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జిన్నా టవర్ హిస్టరీ ఇదే..!
గుంటూరు నగరంలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన జిన్నా టవర్ సెంటర్.. పాకిస్తాన్ జాతిపిత పేరుతో ఉంది. మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ గుంటూరు నగరంలో జిన్నా టవర్ గా పిలుస్తారు. 1941 ప్రాంతంలో సత్తెనపల్లి సమీపంలోని కంటిపూడి పరిసర గ్రామాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో ముస్లిం వర్గానికి చెందిన 14 మందికి జీవిత ఖైదు పడింది. దీంతో అప్పటి గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ జాన్ బాషా వారిని జీవిత ఖైదు నుండి తప్పించటానికి బొంబాయిలో న్యాయవాదిగా ఉన్న జిన్నా సహాయం తీసుకున్నారు. 14 మందికి జీవిత ఖైదు శిక్షగా స్థానిక కోర్టు విధిస్తే, బొంబాయి హైకోర్టులో దానిని రద్దు చేయించారు. అప్పట్లో జిన్నా గుంటూరు వస్తున్నారన్న సమాచారంతో ఆయన గౌరవార్ధం ఆ స్థూపాన్ని నిర్మించారు. ఐతే ఆయనకు తీరిక లేకపోవడంతో రాలేకపోవడంతో అప్పటి నుంచి ఆ టవర్ ను జిన్నా టవర్ గా పిలుస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.