Home /News /andhra-pradesh /

‘మద్యం’ ద్వారా ఏపీలో సంక్షేమ పథకాలు -APSBCL విధులపై Jagan సర్కారు అనూహ్య నిర్ణయం

‘మద్యం’ ద్వారా ఏపీలో సంక్షేమ పథకాలు -APSBCL విధులపై Jagan సర్కారు అనూహ్య నిర్ణయం

ఏపీఎస్‌బీసీఎల్‌ పై జగన్ సర్కారు నిర్ణయం

ఏపీఎస్‌బీసీఎల్‌ పై జగన్ సర్కారు నిర్ణయం

క్వాటర్ కొడితే అమ్మవడి.. హాఫ్ కొడితే ఆసరా.. ఫుల్ కొడితే చేయూత.. అంటూ నెటిజన్లు జగన్ సర్కారు నిర్ణయాన్ని హేళన చేస్తున్నారు. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యతను ఇకపై మద్యం తయారీ, పపిణీ సంస్థ అయిన బూవరేజెస్ కార్పొరేషన్ కు కట్టబెడుతూ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది..

ఇంకా చదవండి ...
    (Anna Raghu, Guntur, News18)
    క్వాటర్ కొడితే అమ్మవడి.. హాఫ్ కొడితే ఆసరా.. ఫుల్ కొడితే చేయూత.. ఇదంతా సామజిక మాధ్యమాలలో నెటిజన్లు ప్రభుత్వం పై ఈ విధంగా తమ నిరసన తెలియచేస్తున్నారు. అసలు ఈ లొల్లి కి కారణం ప్రభుత్వానికి చెందిన కి ఏపీఎస్‌బీసీఎల్‌ కు సంక్షేమ పథకాల బాధ్యతను అప్పగించటమే. ఇంతకీ ఏపీఎస్‌బీసీఎల్‌ అంటే అంటి అనుకుంటున్నారా ప్రభుత్వం తరుపున ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్ లోని మద్యం దుకాణాల నిర్వహణ మద్యం కంపెనీ ల నుండి మద్యాన్ని సేకరించి మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరిపిస్తుంది.

    ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.ఇప్పటివరకు మద్యం క్రయవిక్రయ లను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇప్పటి నుండి రాష్ట్రము లో సంక్షేమ పథకాల అమలు బాధ్యత ను భుజాలకు ఎత్తుకోనుంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయముతో సంస్థ ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంబంధిత సంక్షేమ పథకాల కొరకు వినియోగించనుంది.

    ఈ మేరకు ఆ సంస్థ కు మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ చట్టం 1993 (రెగ్యులేషన్ అఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ మేడ్ లిక్కర్ ,ఫారిన్ లిక్కర్ )కు ప్రభుత్వం సవరణ చేపట్టింది .సెప్టెంబర్ మూడున ఆర్డినెన్స్ ప్రభుత్వం జారీ చేసింది . ఈ కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఇకపై చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలు బాధ్యత ఏపీఎస్‌బీసీఎల్‌దే. మరి ఇలా ఎందుకు చేశారంటే.. ఈ పథకాల కోసం అప్పులు తీసుకురావాల్సి వస్తుంది.. మద్యం అమ్మకాలను చూపించి అప్పులు తీసుకురావడం సులభం అవుతుందన్న వాదన కూడా ఉంది.

    ఈ కొత్త సవరణల ప్రకారం మద్యం విక్రయాల ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు వచ్చే ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రూపొందించిన పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సామాజిక సుస్థిరత కోసం మద్యం అమ్మకం ద్వారా వచ్చే డబ్బు వాడాలి అన్నది ఈ సవరణ ఉద్దేశ్యం. సంక్షేమ పథకాల నిర్వహణ మరింత పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ మార్పులు అంటూ అధికార పార్టీ సమర్థించుకుంటోంది.

    మీ నగరం నుండి (​గుంటూరు)

    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    Published by:Madhu Kota
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap welfare schemes, Liquor sales

    తదుపరి వార్తలు