హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Be care Full: నాలుగు డబ్బులు వస్తాయని.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లను అదెక్కిస్తున్నారా.. ఈ విషాయాలు తెలుసుకోవాల్సిందే

Be care Full: నాలుగు డబ్బులు వస్తాయని.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లను అదెక్కిస్తున్నారా.. ఈ విషాయాలు తెలుసుకోవాల్సిందే

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అద్దెకు ఇస్తున్నారా?

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అద్దెకు ఇస్తున్నారా?

Be Care Full: సెల్ఫీ డ్రైవింగ్ కార్లు ఖాళీగా ఉన్నాయి.. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారా.. ఆ కార్లను అద్దెకు ఇస్తున్నారా..? అయితే బీకేర్ ఫుల్.. తాజాగా జరిగిన ఘటన గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  Be Care Full: మీకు  సొంత కారు ఉందా..? అయితే  రోజూ వాడడం లేదని..  ఊరికే ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు.. అని  సెల్ఫ్ డ్రైవింగ్ (Self Driving) కి కార్ రెంటికిస్తే.. డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య చాలామంది మధ్యతరగతి ప్రజలు ఇదే ఆలోచనలో ఉన్నారు.  కారు కొనుక్కొని సెల్ఫ్ డ్రైవింగ్ కు కార్ అద్దెకిస్తూ (Self Driving Rent Cars) తమ మోజు తీర్చుకుంటున్నారు. కారు ఖాళీగా ఉంచుకునే బదులు.. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చనే  వీరి ఆశను పెట్టుబడిగా కేటుగాళ్లు సెల్ఫ్ కారును అద్దెకు తీసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు కార్ ఓనర్ లను కేసులలో ఇరికిస్తున్నారు.

  అందుకే కార్లను సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. కార్లలో అగంతకులు కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.ఇవన్నీ కార్ల యజమానులకు పీకకు చుట్టుకుంటున్నాయి. సెల్ఫ్ డ్రైవ్ పేరుతో వారు చేసే మోసాలకు కార్ల యజమానులు బలైపోతున్నారు.

  తాజాగా పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డి గూడెం (Jangareddy Gudem) మండలం లక్కవరం పోలీసులు నేరాలకు ఉపయోగించిన రెండు కార్లపై కేసు నమోదు చేశారు. నిందితులు నేరం చేయడానికి రెండు కారులను సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకున్నారు. జంగారెడ్డి గూడానికే చెందిన ఒక వ్యక్తి కారు అద్దెకి తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఓరోజు ముక్కు మొహం తెలియని వ్యక్తి కారు కావాలని ఫోన్ చేశాడు. రోజుకు 3 వేల రూపాయలు ఇస్తానన్నడంతో యజమాని ఆశపడ్డాడు.

  ఇదీ చదవండి : అమరావతి రైతులను రెచ్చగొట్టొద్దు.. సొంత పార్టీ నేతలకు మంత్రి వార్నింగ్.. అదే జరిగే పదవికి అనర్హుడిని..

  సాధారణంగా రోజుకి 1500 నుంచి 2000 వరకు అద్దె ఉంటుంది. అదనంగా సొమ్ము వస్తుందని మూడు కార్లు అద్దెకిచ్చాడు. వారం రోజులైనా కారు రాలేదు. పది రోజుల తర్వాత ఫోన్ కూడా పనిచేయడం మానేసింది. సదరు కారు యజమానికి టెన్షన్ మొదలైంది. కారుకు ఈఎంఐ చెల్లించాల్సిన సమయం దగ్గర పడటంతో సదర్ యజమాని స్నేహితులకు జరిగిన విషయాన్ని తెలియపరచగా ఐదు లక్షల విలువచేసే కారుని ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఎలా ఇచ్చేసావని ప్రశ్నించారు.

  ఇదీ చదవండి : శివలింగాన్ని కూడా వైసీపీ నేతలు వదలరా..? గోలింగేశ్వరస్వామి ఆలయంలో అపచారం..

  40 రోజుల తర్వాత విజయవాడలో ఒక ఫైనాన్సు ఆఫీసుల్లో రెండున్నర లక్షకి తాకట్టు పెట్టారని తెలిసి యజమాని అవాక్కయ్యాడు. జంగారెడ్డిగూడెం కి చెందిన మరో వ్యక్తి కారు విక్రయాలు చేస్తుంటాడు.కొనుగోలు చేసిన కార్లను విక్రయించే వారికి  సెల్ఫ్ డ్రైవ్ కి ఇస్తుంటాడు. వ్యాపారం సజావుగా సాగుతున్న సమయంలో కారును లక్కవరం పోలీసులు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లిపోయారు. తీరా విషయం ఏమిటంటే నాలుగు మాసాల క్రితం అద్దెకి తీసుకెళ్లిన వ్యక్తి అదే కారులో రెండు మేకపోతులను దొంగలించి వచ్చాడని పోలీసులు వివరణ ఇచ్చి కారుపై నమోదైన FIR కాపీని చేతిలో పెట్టారు.

  ఇదీ చదవండి : రేషన్ కార్డ్ హోల్డర్ కు బిగ్ షాక్.. ఇకపై నుంచి అవి కూడా కట్..! ఎందుకంటే..?

  కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాల  ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కార్లను కూడా అద్దెకు ఇస్తుంటాడు ఒకరోజు తన స్నేహితుడు వారం రోజులు కారు కావాలని, ఎక్కువ అద్దె ఇవ్వలేనని, చాలా అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను అని చెప్పడంతో జాలిపడి తక్కువ అద్దెకు కారు ఇచ్చాడు. 15 రోజుల దాటిన కారు రాకపోవడంతో స్నేహితుడి కోసం విచారించగా ప్రేమించిన అమ్మాయితో ఊరి నుంచి వెళ్ళిపోయాడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

  ఇదీ చదవండి : ప్రయాణికులకు పండుగ ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏంటో తెలుసా?

  డ్రైవర్ లేకుండా అద్దెకు కారు ఇచ్చే వారికీ ఇలా ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు. సంఘవిద్రోహ చర్యలకు పాల్పడేవారు ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లను అద్దెకు తీసుకొని గంజాయి, మాదకద్రవ్యాల రవాణా చేస్తూ పట్టుబడిన ఉదంతాలు గతం లో ఎన్నో ఉన్నాయి , అంతే కాదు సెల్ఫ్ డ్రైవింగ్ కు కార్ లు అద్దెకు తీసుకొని వాటిని ప్రవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి సుమారు రెండు కోట్ల రూపాయలు తీసుకొని జల్సాలకు పోయిన ఘటన గతం లో గుంటూరు లో జరిగింది.అంతే కాదు సెల్ఫ్ డ్రైవింగ్ కి కార్ తీసుకొని దొంగనోట్లు మార్చటం,దొంగతనాలు, రాష్ డ్రైవింగ్ చేసి ఐసీసిడెంట్లు చేయటం వంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి.

  ఇదీ చదవండిపేదలు, సామాన్యులకు బిగ్ షాక్.. ఇక అన్నం గురించి మరిచిపోవాల్సిందేనా..?

  వీరు  చేసిన నేరాలలో అన్యాయం గా కార్ ఓనర్ లు కూడా ముద్దాయిలుగా మారుతున్నారు.  సరైన అనుమతులు లేకుండా కారు ను అద్దెకు ఇవ్వడం వల్ల ఒక్కోసారి కారు ఓనర్ లు ముద్దాయిలుగా కటకటాలు లెక్కపెట్టవలసి వస్తుంది .

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

  ఉత్తమ కథలు