హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Crime News: మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అమెరికా సంబంధం అని మోజు పడుతున్నారా..?

అమెరికా సంబంధం అని మోజు పడుతున్నారా..?

Crime News: అమ్మాయి పెళ్లీడుకు వచ్చిందని.. ఆమెకు అమెరికా సంబంధం చేయాలని ఆరాటపడుతున్నారా..? అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. అంతే సంగతులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Crime News:  ఈ రోజుల్లో కాదేది మోసాలకు అవకాశం అన్నట్టు మారింది. టెక్నాలజీ (Technology) పెరగడంతో.. అదే స్థాయిలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త కొత్త దారుల్లో కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ఆన్ లైన్ (Online cheating) వేదికగా జరిగి ప్రతి వ్యవహారాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తాజాగా మాట్రిమోనీ సైట్ (Matrimony Web Site) లను కూడా వదలటం లేదు ఈ కేటుగాళ్లు. ఇటీవల జరుగుతున్న నేరాల్లో మ్యాట్రిమోని సైట్లలో ఘరానా మోసాలు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ (Fake Profile) అప్‌లోడ్‌ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. డబ్బు దోచుకుంటున్నారు. ఆడపిల్లల తల్లితండ్రుల ఆశనే వారు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.  వారి ఆశలు పెట్టుబడిగా చేసుకున్ని.. అమెరికా సంబంధం అంటూ మొదట పరిచయం చేసుకుంటున్నారు. తరువాత వివిధ రూపాల్లో దొరికినంత దోచేస్తున్నారు.

  తాజాగా ఓ యువ‌తి మ్యాట్రిమోని సైట్‌లో మోస‌పోయానని పోలీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టాలని కళలు కనే అమ్మాయిలకు మంచి సంబంధం తేవడానికి.. ఈ మధ్యకాలం లో మాట్రిమోనీ సైట్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటినే మోసాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు..

  కుమార్తెను విదేశాలకు పంపాలని అక్కడైతే సుఖంగా ఉంటుందని ఆడపిల్ల తల్లి తండ్రులు ఎక్కువగా విదేశాలలో ఉండి.. జాబ్ చేసుకునే అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. ఈ చిన్న ఆశను తమకు అనువుగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు.

  ఇదీ చదవండి : వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు

  నరసరావుపేట రామిరెడ్డి పేటకి చెందిన యం,స్వరూపారాణి పెళ్లి సంబంధాల కోసం తన బయో డేటాను ఒక ప్రముఖ మాట్రిమోనీ సైట్ లో పెట్టింది. అదే సమయంలో విశాఖపట్నం ఎంవిపీ కాలనీ కి చెందిన కొచ్చర్ల శ్రీకాంత్  కూడా తన బయో డేటా ను పెట్టాడు. అయితే  శ్రీకాంత్ ప్రొఫైల్ నచ్చి శ్రీకాంత్ ని సంప్రదించారు స్వరూపా రాణి తల్లి తండ్రులు. శ్రీకాంత్ అమెరికాలో తాను సాఫ్ట్ వేర్  కంపెనీలో సీనియర్ డేటా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న నని చెప్పాడు.

  ఇదీ చదవండి : ఈ మహానగరానికి ఏమైంది..? భయపెడుతున్న వరుస ప్రమాదాలు.. ఖాకీలను వెంటాడుతున్నాయి

  అలాగే తన తండ్రి ప్రసాదరావు కూడా వారి సంబంధం పై ఆసక్తి చూపుతున్నాడని త్వరలో వివాహానికి అంగీకరించాడని శ్రీకాంత స్వరూపా రాణి కి తెలిపాడు. పెళ్లి ఇయినా వెంటనే అమెరికా కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని ఆమె దగ్గర నుండి అన్ని వివరాలను తెలుసుకొని కొన్ని రోజుల తరువాత వీసా కొరకు స్లాట్ బుక్ చేస్తానని పెళ్లి ఇయినా వెంటనే వెళ్లిపోవచ్చని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత వీసా రిజెక్ట్ అయిందని.. మీ సిబిల్ రేటింగ్ బాగాలేదని దాన్ని పెంచటానికి ఎక్కువ గా లావాదేవీ లు జరపాలని తాను చెప్పిన అకౌంట్లకు డబ్బు పంపమని చెప్పాడు.

  ఇదీ చదవండి: అక్కాబావ ఫ్యామిలీ రెస్టారెంట్‌..! తక్కువ రేటుకే తిన్న వాళ్లకు తిన్నంత.. ఎక్కడో తెలుసా

  శ్రీకాంత్ మాటలు నమ్మి స్వరూపారాణి సుమారు నలుబై ఎనిమిది లక్షల యాబై వేలు  శ్రీకాంత్  చెప్పిన అకౌంట్లకు పంపింది. స్వరూప రాణి తన సోదరుడుతో ఈ లావాదేవీల గురించి చెప్పింది. స్వరూప సోదరుడు ఈ లావాదేవీలు మోసపూరితమైనవిగా గుర్తించి శ్రీకాంత్ గురించి మరింత లోతుగా ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది.. ఆ కేటుగా ఫేక్ ప్రొఫైల్ తో నిండా ముంచాడని.. దీంతోఆ యువతి..  మోసపోయామని గ్రహించి నరసారావు పేట పోలీసులకు పిర్యాదు చేసింది..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

  ఉత్తమ కథలు