GUNTUR BANK MANAGER BOOKED FOR CHEATING BY TAKING LOAN ON FAKE GOLD IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Gold loan Scam in AP: గోల్డ్ లోన్ పేరుతో గోల్ మాల్ పనులు.. బ్యాంకుల్లో ఘరానా మోసాలు
ప్రతీకాత్మకచిత్రం
బ్యాంకు (Banks) లంటే ప్రజలకి నమ్మకం. అందుకే బంగారం వంటివి తాకట్టుపెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటుంటారు. వడ్డీ తక్కువ, నగలకు భద్రత ఉంటుందని బ్యాంకుల్లో తాకట్టుపెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రెండు బ్యాంకుల్లో గోల్డ్ లోన్ స్కామ్ వెలుగుచూసింది.
బ్యాంకు (Banks) లంటే ప్రజలకి నమ్మకం. అందుకే బంగారం ( Gold Loan) వంటివి తాకట్టుపెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటుంటారు. వడ్డీ తక్కువ, నగలకు భద్రత ఉంటుందని బ్యాంకుల్లో తాకట్టుపెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రెండు బ్యాంకుల్లో గోల్డ్ లోన్ స్కామ్ వెలుగుచూసింది. పల్నాడు జిల్లా (Palanadu) రాజుపాలెం మండలంలోని ఆకుల గణపవరంలోని ఒక ప్రముఖ జాతీయ బ్యాంకులో అదే గ్రామానికి చెందిన యువకుడు గతేడాది జనవరిలో 20 గ్రాముల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఆభరణాలు విడిపించుకునేందుకు బ్యాంకుకు వచ్చి వడ్డీతో సహా అప్పుమొత్తం తీర్చేశాడు. ఐతే మధ్యాహ్నం వచ్చి నగలు తీసుకెళ్లాలని బ్యాంక్ సిబ్బంది సూచించడంతో మధ్యాహ్నం వచ్చాడు. అక్కడున్నవారు సాయంత్రం రమ్మని చెప్పి రాత్రి 8గంటల వరకు కూర్చోబెట్టారు. దీంతో ఆగ్రహించిన యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో గ్రామపెద్దలు యువకుడ్ని పిలిచిమాట్లాడగా.. బంగారం మిస్సైనట్లు క్లర్క్ అంగీకరించాడు. ఐతే బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనేది మిస్టరీగా మారింది. బంగారం ఎక్కడైనా పోయిందా..? లేక ఇంటి దొంగలే మాయం చేశారా..? అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.
ఐతే బ్యాంకులో కస్టమర్లు తనఖా పెట్టిన బంగారాన్ని లెక్కచూడగా 19 కవర్లలో బంగారం నకిలీదని తేలింది. గోల్డ్ అప్రైజర్ తూకం వేసి సంచి ముఠా కట్టి ఇచిన తరువాత స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచే సమయంలో అటెండర్ తన హస్తలాఘవాన్ని చూపినట్లు వెల్లడైంది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి చెంచుపేటలోని కేంద్ర సహకార బ్యాంకులో మేనేజర్, గోల్డ్ అప్రైజర్, మరో ఖాతాదారుడు కలిసి బ్యాంకునే బురిడీ కొట్టించారు. మేనేజర్ వరలక్ష్మి, గోల్డ్ అరైజర్ అప్రైజర్ జానీ బాషా అథడి సోదరుడు, మరికొంతమంది ఖాతాదారులతో కలిసి నకిలీ బంగారం తాకట్టుపెట్టి ఏకంగా రూ.42లక్షలు రుణం తీసుకున్నారు. ఇటీవల బ్యాంకు నోడల్ అధికారిణి వరలక్ష్మి సాధారణ తనిఖీల్లో భాగంగా లోన్లు, తాకట్టుపెట్టిన బంగారాన్ని తనిఖీచేయగా వీరి బండారం బయటపడింది.
దీంతో వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు వారి నుంచి రూ.20లక్షలు రికవరీ చేశారు. మొత్తం 29 మంది పేర్లతో వీరు నకిలీ బంగారంపై రుణం తీసుకున్నట్లు అధికారులు తేల్చారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.