డబ్బు. మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. డబ్బు మాయలో పడినా. వ్యసనాలకు బానిసైనా జీవితంలో దిగజరాక తప్పదు. సమాజం లో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఆందోళన కలగక మానదు నేటి యువత పయనమెటో చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. చాలామందిలో దురలవాట్లు చోటు చేసుకుంటున్నాయి. మత్తు పదార్థాలకు బానిసలు కావడం, ధూమపానం, గుట్కాలకు అలవాటు పడటం, స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తన, పెద్దలను ఎదిరించడం తదితర దురలవాట్లను పెంపొందించు కుంటున్నారు. ఈ దురలవాట్లు వారి బంగారు భవిష్యత్తును బుగ్గి పాలుచేస్తుంది. దుర్వ్యసనాల ప్రభావం తో కొందరు తమ వివేకాన్ని కోల్పోయి దొంగలుగా సమాజ ద్రోహులు గా మిగులుతున్నారు. బ్యాంక్ లో పైస్థాయిలో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి దారితప్పాడు. తప్పుచేసి జాబ్ పొగొట్టుకొని.. మళ్లీ అవే తప్పులు చేయడం మొదలుపెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్ర్రప్రదేశ్(Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి మండలం చిన్న రావూరుకు చెందిన సభావాత్ కృష్ణా నాయక్ డిగ్రీ పూర్తిచేసి ఆంద్రాబ్యాంక్ లో క్లర్క్ గా ఉద్యోగం సంపాదించాడు. నాలి చుట్టుపక్కల ప్రాంతాలలో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ రావడంతో పూణేలో పోస్టింగ్ ఇచ్చారు. ఐతే పనిచేస్తున్న సమయంలో ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం ఉద్యోగం నుండి తొలగించారు.
ఇప్పటికే జల్సాలు చేయడం, వ్యసనాలకు అవలవాటు పడిన కృష్ణనాయక్.., డబ్బు కోసం దొంగగా మారాడు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించటం ప్రారంభించాడు. సరైన నిఘాలేని ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకోని బైక్ లను చాకచక్యంగా దొంగిలించేవాడు. ఈ క్రమంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతికి చెందిన బైక్ ను దొంగిలించాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. ఈ క్రమంలో ఇటీవల నమోదైన బైక్ మిస్సింగ్ కేసులను విశ్లేషించి తీగలాగగా కృష్ణానాయక్ బండారం బయటపడింది.
కృష్ణా నాయక్ ను విచారించగా చేసిన నేరాలను అంగీకరించాడు. గుంటూరులో రెండు, విజయవాడలో ఆరు బైకులు చోరీ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. నిందితుడి ఇచ్చిన సమాచారంతో అతడు చోరీ చేసిన బైకులను స్వాధీనం చేసుకోని రిమాండ్ కు తరలించారు. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించిన కృష్ణనాయక్ ను వ్యసనాలు నేరస్తుడిగా మార్చాయి. చివరకు జైలుపాలు చేశాయి.
ఇటీవల గుంటూరు జిల్లా బాపట్ల బ్రాంచ్ లో ఓ ఉద్యోగి ఏకంగా ఆరు కేజీల బంగారాన్ని మాయం చేశాడు. ఆ బంగారాన్ని తాకట్టుపెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. చివరకు ఉద్యోగం పొగొట్టుకోవడమే కాకుండా జైలుకు వెళ్లాడు. అంతకుముందు చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆప్ బరోడా బ్రాంచ్ లో స్వయం సహాయక సంఘాలకు చెందిన డిపాజిట్లను మెసెంజర్ మాయం చేశాడు. ఇందులో సిబ్బంది పాత్ర ఉండటంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.