హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: ఒకే కుటుంబంలో ఇద్దరు MLA లు ఉండొచ్చు..కానీ, ఒక జాతి మొత్తానికి ఒక్క ఎమ్మెల్యే కూడా వద్దా..?

Guntur: ఒకే కుటుంబంలో ఇద్దరు MLA లు ఉండొచ్చు..కానీ, ఒక జాతి మొత్తానికి ఒక్క ఎమ్మెల్యే కూడా వద్దా..?

రాజకీయ అవకాశాలు కావాలంటున్న దూదేకుల సామాజిక వర్గం

రాజకీయ అవకాశాలు కావాలంటున్న దూదేకుల సామాజిక వర్గం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పొలిటికల్ రిజర్వేషన్ (Reservation) ఉద్యమం మొదలయ్యే సూచనలు కనిపిస్తన్నాయి. ముస్లింలలో భాగమైన దూదేకులు రాజకీయం అవకాశాలు, ప్రాధాన్య కోసం ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Gunturఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పొలిటికల్ రిజర్వేషన్ (Reservation) ఉద్యమం మొదలయ్యే సూచనలు కనిపిస్తన్నాయి. ముస్లింలలో భాగమైన దూదేకులు రాజకీయం అవకాశాలు, ప్రాధాన్య కోసం ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని పార్టీలు, ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దూదేకులను నూర్ బాషా, లాధాఫ్, పింజరి, మన్సూరి ఇలా ప్రాంతాల వారీగా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వీరంతా ముస్లిం వర్గానికి చెందినవారే. ఇందులో దూదేకుల వారు చేతి వృత్తే జీవనధారంగా చేసుకుని జీవిస్తారు. ఐతే తాము దశాబ్దాలుగా పేదరికం, వివక్షత, వెనుకబాటుతనానికి గురవుతున్నామని దూదేకుల పెద్దలు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దూదేకుల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ రాజకీయ అవకాశాలను అందుకోవడంలో మాత్రం వివక్షకు గురవుతున్నామంటున్నారు.
  ఆంద్రప్రదేశ్ ముస్లింలలో ఉపకులంగా ఉన్న దూదేకులను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని.., రాజకీయ పార్టీల నుండి వచ్చే పదవులుగాని, ప్రభుత్వం నుండి వస్తున్న పదవులు అన్ని ముస్లిం కోటాలో పడడంతో దూదేకులు రాజకీయంగా వెనుకబడ్డారని సామాజికవర్గ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు కడుతున్నారా..? అయితే మీ డిపాజిట్ సేఫేనా.. బెజవాడలో ఏం జరిగిందో చూడండి..!


  ఇప్పటీ వరకు ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో దూదేకులను అందలం ఎక్కిస్తామని ఇచ్చిన రాజకీయ పార్టీల హామీలు అటకెక్కాయని వారు విమర్శిస్తున్నారు. ఏపీలో ముస్లింలు జనాభా దాదాపు 50 లక్షలపై చిలుకు ఉంటే దూదేకుల సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు 20లక్షల జనాభా ఉంటారని.., తమకు బీసీ-బీ రిజర్వేషన్ అమలు చేస్తున్నా.. అవకాశాలు మాత్రం దక్కడం లేదంటున్నారు. ఇటు బీసీల్లో మనుగడ సాధించ లేక అటూ మైనార్టీ లో నిలవలేక దూదేకుల కులం గుర్తింపు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 139 కులాలు ఉన్న బీసీల్లో పదవుల్లో, హక్కు ఉన్న మైనార్టీ పదవుల్లో నిరాశే మిగులుతుందని మండిపడుతున్నారు.

  ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?


  ముస్లింలులాగానే దూదేకులు వక్ఫ్ బోర్డ్ నుండి వచ్చే ప్రతి బేనీఫ్ట్ కు అర్హులేకానీ వక్ఫ్ బోర్ఫ్ పదవుల్లో మాత్రం అవకాశం కల్పించడం లేదంటున్నారు. అలాగే హజ్ కమిటీ, రాజ్యాంగ పదవి అయిన మైనార్టీ కమిషన్ పదవుల్లో రాజకీయ అవకాశాలు రావడం లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇక ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ ఇలా ఒకటి కాదు ముస్లిం కోటలో వచ్చే ఏ ఒక్క పదవి కూడా దూదేకుల చెంతకు వచ్చిన చరిత్ర లేదని చెబుతున్నారు.


  2019 ఎన్నికల్లో వైసీపీ నుండి కడప అంజాద్ భాష, హిందూపురం నుండి మహ్మద్ ఇగ్బాల్, గుంటూరు నుండి ముస్తఫా, చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి నవాజ్ భాష, కర్నూల్ నుండి హాఫిజ్ ఖాన్ ఇలా ఐదుగురు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్యెల్యే టికెట్లు ఇచ్చిందని.. ఈ విషయంలో దూదేకులను మరిచిందని ఆరోపిస్తున్నారు. జానాభా ప్రకారం తమకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎమ్మెల్సీ, ఒక లోక్ సభ, ఒక రాజ్యసభ స్థానాలు కేటాయించాలని లేదంటే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News, Muslim Minorities

  ఉత్తమ కథలు