హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-TS Boarder Issue: ఏపీ-తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP-TS Boarder Issue: ఏపీ-తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిన అంబులెన్సులు

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిన అంబులెన్సులు

ఏపీ-తెలంగాణ బోర్డర్ దగ్గర అంబులెన్స్ లు ఆపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి పరిస్థితి చక్కబెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

  ఏపీ-తెలంగాణ బోర్డర్ దగ్గర పరిస్థితి తీవ్ర ఉద్రికత్తంగా మారింది. ముఖ్యంగా అస్పత్రుల నుంచి ఎలాంటి అనుమతి లేని అంబులెన్స్ లను బోర్డర్ లోకి అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త  ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.

  వైద్య సహాయం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని కోర్టు పేర్కొంది. అంబులెన్స్‌లో వస్తున్న పేషంట్ ప్రవేశాన్ని కంట్రోల్ రూం ఆపలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ధర్మాసనం స్పష్ట చేసింది. పేర్కొంది. అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ పోలీస్‌శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. ఏపీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్‌ 14 ఉల్లంఘనేనని ఏపీ ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను 17కు హైకోర్టు వాయిదా వేసింది.

  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చినా.. ప్రస్తుతానికి ఇంకా బోర్డర్ దగ్గర అంబులెన్స్ లను తెలంగాణ ప్రభుత్వం అనుమతించడం లేదు. తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బోర్డర్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందులో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వారంతా పోలీసులను వేడుకుంటున్నారు. అయితే తాము ఏం చేయాలనేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్ లో ఏదైనా ఆస్పత్రి నుంచి అనుమతి తీసుకుంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.

  బోర్డర్ దగ్గర అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు ఆపేయడంతో ఏపీ ప్రభుత్వం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ వెంటనే తెలంగాణ సీఎంతో మాట్లాడాలని.. అంబులెన్స్ లను అనుమతించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. తీవ్ర నిమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం, అధికారులతో చర్చిస్తూనే.. న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  తాజా వివాదంపై ఏపీ ప్రభుత్వం సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంబులెన్స్‌లను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని, న్యాయస్థానం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్‌ పెట్టిందన్నారు. ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అయినా మానవత్వంతో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ల ప్రజల గురించి ఆలోచించడం సహజమేనని.. అయితే తెలంగాణ ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ పాటించడం కష్టమని అన్నారు. వైద్యం కోసం ఏపీ నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్తున్నారని.. ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దులోనే వస్తోందన్నారు. మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రాష్ట్రాలకు వెళ్లడం సాధారణమన్నారు. గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టలేదని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారరు. 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేయడంతో తాము ఈ అవకాశాన్ని కోల్పోయామంటూ విమర్శించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra, Andhra Pradesh, Ap government, AP News, AP Telangana border, Sajjala ramakrishna reddy, Supreme Court

  ఉత్తమ కథలు