హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amabati Ramababu: ఆ విషయాలు చెపితే ఉరి వేసుకోవాల్సిందే..? చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Amabati Ramababu: ఆ విషయాలు చెపితే ఉరి వేసుకోవాల్సిందే..? చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

అంబటి రాంబాబు

అంబటి రాంబాబు

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర మొత్తం చద్రబాబు జాతకం ఉందని.. ఆ విషయాలు అందరిలో బయట పెట్టాను అంటే.. చంద్రబాబు ఉరి వేసుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే.?

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Amabti Ramababu: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి.. ప్రత్యక్షంగా రాజకీయ యుద్ధంగా మారుతున్నాయి.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దేందులూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేష్ ను చంపుతామని వైసీపీ నేతలు చేబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల బాబాయిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని సీఎం జగన్ (Cm Jagan) పై పరోక్షంగా విమర్శలు చేశారు. జగన్ కు పోలీసులు ఉంటే తనకు ప్రజలున్నారని చంద్రబాబు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల తాను చివరి అవకాశం తనకు అని చెప్పలేదని.. ఈ సారి ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే.. ప్రజా స్వామ్యానికి.. నిజాయితీగా ఉన్న ప్రజలకు చివరి ఎన్నికలుగా మారే ప్రమాదం ఉందని.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండవని అన్నారు. చరిత్ర అవసరం లేదు. కానీ ఈసారైనా ప్రజలు కళ్లు తెరవాలని చంద్రబాబు (Chandrababu Naidu) పేర్కొన్నారు. వాళ్లు తలచుకుంటే మొద్దు శ్రీనును మా ఇంటికి పంపించేవారని రాయలసీమలో ఒకరు అంటున్నారని ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. తనను గంట, అరగంట మంత్రి అన్నందుకు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నన్ను గంట, అరగంట మంత్రి అంటున్నారని.. సంస్కారం ఉందా? అని ఆయన మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ నేతగా సంజయ్ గాంధీ దగ్గర చంద్రబాబు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడో తన దగ్గర చిట్టా ఉందన్నారు. అంజయ్య క్యాబినెట్ లో ఉన్నప్పుడు వైఎస్సార్ బ్యాగులు, సూట్ కేసులు మోసిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పెళ్ళి సంగతి తెలుసని.. అలాగే తన కుటుంబం గురించి తెలుసు అన్నారు.

మీ రామ్మూర్తి నాయుడు గురించి, నీ భార్య గురించి, కొడుకు గురించి అందరికి గురించి తనకు పూర్తిగా తెలుసు అన్నారు. ఒక్క నిమిషం సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నీ కుటుంబం గురించి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్. నోరు అదుపులో పెట్టుకో. నోరు జారితే ఉరేసుకుని చచ్చే విషయాలు బయట పెడతాను అని హెచ్చరించారు. జగన్ నవ్వుతున్నా చూసి ఏడ్చే ఖర్మ చంద్రబాబుది అన్నారు. ఊరకనే నోరు పారేసుకుంటే కుదరదని వార్నింగ్ చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావటం అసంభవమని.. తాము చంద్రబాబు, లోకేష్ ను చంపేస్తామా?? రాజకీయంగా ఏమున్నారని చంపటానికి??’ అంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

First published:

Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Chandrababu Naidu

ఉత్తమ కథలు