Andhra Pradesh: వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే? ఏబీవీకి ఏపీ పోలీసుల కౌంటర్

వైఎస్ వివేకానంద హద్య కేసుపై ఆగని దుమారం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రోజు ఏం జరిగగింది? తన దగ్గర సమాచారం ఉంది అంటున్నారు మాజీ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఆ సమాచారం ఇచ్చినా సీబీఐ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకు లేఖ రాశారు. దానికి ఏపీ పోలీసులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ రోజు విచారణ జరిగినప్పుడు కీలక పాత్రలో ఉన్న ఆయన అప్పుడు ఏం చేశారంటూ ఏపీలో పోలీసులు నిలదీస్తన్నారు. అయితే ఇద్దరి వ్యాఖ్యలు చూస్తే.. కచ్చితంగా ఈ హత్య వెనుక రాజకీయ దురద్దేశాలు ఉన్నాయని సామాన్య మానవుడికి కూడా అర్థవమవుతోంది.

 • Share this:
  ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దుమారం ఇంకా చల్లారడం లేదు. ఇటీవల ఈ హత్య కేసుకు సంబంధించి సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయ‌డం హాట్ టాపిక్‌ అయ్యింది. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్యకేసు సంబంధించి పూర్తి సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపాన‌ని.. అయినా స్పందించ‌లేద‌ని పేర్కొన్నారు. దీంతో ఏబీవీ లెటర్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ ప్రభుత్వమే కేసును తప్పుదారి పట్టించేలా చేస్తోందనే అర్థం వచ్చేలా ఆయన లేఖలు ఉన్నాయంటూ అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతన్నారు. తాజాగా ఏబీవీ లేఖ‌కు కౌంట‌ర్ ఇచ్చింది ఏపీ పోలీసు శాఖ‌. డీజీపీ, ఇతర పోలీసు అధికారుల పైనా.. వివేకా హత్య విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై స్పందించిన డీఐజీ పాల్ రాజు.. వివేకా హత్య కేసులో ఆధారాల్లేకున్నా.. జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశార‌ని కౌంట‌ర్ ఎటాక్ చేశారు.

  వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో దర్యాప్తు మొత్తం ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జ‌రిగింద‌ని పాల్ రాజు గుర్తు చేశారు. ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే గతంలో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ మీడియాతో మాట్లాడేవార‌ని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న కీలక సమాచారాన్ని అప్పుడే ఏబీ వెంకటేశ్వరరావు సిట్ కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ఆయన ప్ర‌శ్నించారు. దర్యాప్తు విషయాన్ని పక్కన పెట్టి జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని ఒత్తిడి తెచ్చారా..? లేదా..? పాల్ రాజు నిలదీశారు.

  అప్పుడు దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఏబీవీ ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కాదా..? అని నిల‌దీశారు.. రాహూల్ దేవ్ శర్మ నిబద్దత అధికారి కాబట్టి ఏబీవీ ఒత్తిళ్లకు తలొగ్గలేద‌ని.. వివేకా హత్య కేసు విషయంలో తన వద్దనున్న దర్యాప్తు సమాచారాన్ని ఏబీవీ అందివ్వకపోవడం తప్పు కాదా..? అని మండిప‌డ్డారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను మీడియాలో బయట పెట్టడం సమంజసం కాద‌ని హిత‌వు ప‌లికిన డీఐజీ పాల్ రాజు.. కృత్రిమ డాక్యమెంట్లు సృష్టించారన్న ఏబీ ఆరోపణలు నిరాధారమైన‌వ‌ని కొట్టిపారేశారు.

  సహచర అధికారులపై ఏబీ ఆరోపణలు గుప్పించడం స‌రికాద‌న్నారు. సర్వీస్ రూల్సుకు విరుద్ధంగా ఏబీవీ వ్యవహరించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. డీజీ హోదాలో ఉన్న ఏబీవీ ఈ తరహాలో వ్యవహరించడం స‌రికాద‌న్నారు. రక్షణ, అంతర్గత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై సస్పెన్షన్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, డైరెక్టర్ జనరల్ ఏబి వెంకటేశ్వరరావు మొన్న తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగిందని. ఆ లేఖను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం, లేఖలోని వివరాలను అందరికీ తెలిసే విధంగా బహిర్గతం చేయడం వల్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి అన్నారు. అందుకే ఆయన రాసిన లేఖ పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి వాస్తవాలను తెలిపే క్రమంలో ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది అన్నారు.
  Published by:Nagesh Paina
  First published: