Home /News /andhra-pradesh /

GUNTUR AP NEW MINSTER VIDUDALA RAJANI TAKE CHARGE AS A MINSTER AND THIS IS THE FIRST SIGN NGS

Vidudal Rajani: మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ గుడ్ న్యూస్ చెప్పిన విడుదల రజని.. తొలి సంతకం దానిపైనే..

విడుదల రజనీ తొలి సంతకం

విడుదల రజనీ తొలి సంతకం

Vidudal Rajani: ప్రస్తుతం జగన్ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన.. విడుదల రజనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమె రచ్చ మామూలుగా ఉండదు.. అందుకే అంత క్రేజ్ తాజాగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలి సంతకం ఏం చేశారంటే..?

ఇంకా చదవండి ...
    Vidudal Rajani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కేబినెట్ లో కొత్తగా 14 మంది వచ్చారు. అయితే అందులో అత్యంత యువ మంత్రిగా విడుదల రజనీ (Vidudala Rajani) గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు.. కేబినెట్ లో అంత్యంత క్రేజీ సభ్యుల్లో రజనీ ఒక్కరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమె ఏం చేసినా..? కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ఆమె ఏం చేస్తున్నారని ఆసక్తిగా అంతా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆమె.. సచివాలయంలో తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.. తన పిల్లలతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ వైద్యులకు జీతాలు పెంచే ఫైల్ పై తొలి సంతకం చేశారు.  ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత  ఇస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందని.. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని ఆమె గుర్తు చేశారు.

    రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని.. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మే నెల ఆఖరులోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పాలసీ ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూరుస్తున్నామని.. టెలీ మెడిసిన్ సర్వీసెస్.. హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడా రాజీ పడడం లేదని.. అలాంటి సీఎం మనకు ఉండడం ప్రజల లక్ అన్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నామని.. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందించడమే మంత్రిగా తన లక్ష్యం అన్నారు.

    ఇదీ చదవండి : మంత్రి పదవి పోయిన తరువాత కొడాలి నానిని ఇలా చూసి.. ఫ్యాన్స్ షాక్.. కారణం అదేనా?

    ప్రతి పార్లమెంటు పరిధిలోనూ మెడికల్ కళాశాలలు రాబోతున్నాయని మంత్రి విడదల రజిని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విడదల రజిని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని విడదల రజిని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి : మంత్రి అయ్యి ఉండి స్వామి ఉంగరం తీస్తారా అంటూ ప్రశ్న..? భయంతో వణికిన అమ్మాయిలు

    నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడదల రజిని స్పష్టం చేశారు. అంతేకాదు మెడికల్ సర్వీసెస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐకాన్ గా నిలుస్తోందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాడే రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణం పై గుడ్ న్యూస్ చెప్పిన విడదల రజిని సీఎం జగన్ తనకు ఇచ్చిన బాధ్యత మేరకు వైద్య ఆరోగ్యశాఖను గాడిలో పెట్టడం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించటమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, AP News, Vidadala Rajani

    తదుపరి వార్తలు