హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: దాదాపు ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఇంకా ఓటు వేయని ఒక్క ఎమ్మెల్యే ఎవరు?

Breaking News: దాదాపు ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఇంకా ఓటు వేయని ఒక్క ఎమ్మెల్యే ఎవరు?

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ

Breaking News: ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రెేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగింపు దశకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 174 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే ఇంకా ఓటు వేయని ఆ ఎమ్మెల్యే ఎవరు..? అసలు ఓటు వేస్తారా అనే చర్చ మొదలైంది..? దీంతో ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక (MLA Quota MLC Elections).. అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్ష టీడీపీ (TDP) రెండు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాస్తవ  బలం ప్రకారం చూసుకుంటే.. టీడీపికి 19 ఓట్లు ఉండగా.. వైసీపీకి 156 ఓట్ల బలం ఉంది. వైసీపీ గెలిచినవి 151  అయితే.. జనసేన (Janasena) ఎమ్మెల్యే ఒకరు.. టీడీపీ ఎమ్మెల్యే నలుగురు వైసీపీకి జై  కొట్టారు. అయితే రెండు పార్టీలు విప్ జారీ చేసినా.. ఇవి రహస్య బ్యాలెట్ ఎన్నిక కావడంతో విప్ పని చేయదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అందుకే ఆత్మ ప్రబోధాను సారం ఓటేస్తామని కొందరు ఎమ్మెల్యే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీకి 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అందులో రెబల్ నేతలు కోటం  రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీకి ఓటు వేసి ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు. అంటే వైసీపీ దగ్గర ఉన్నవి 154 ఓట్లు అవుతాయి. ఆ లెక్కన చూసినా.. ఎక అభ్యర్థి గెలవడానికి 22 ఓట్లు అవసరం.. అంటే వైసీపీ 7 గురు అభ్యర్థులను గెలిపించుకోవచ్చు.. టీడీపీ 21 మంది దగ్గర ఆగుతుంది. గెలుపుకు ఒక్క ఓటు అవసరం.. ఆ ఒక్క ఓటే కాదు.. మరికొన్ని క్రాస్ ఓట్లు ఉంటాయని టీడీపీ ధీమా గా చెబుతుండడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.

ఇప్పటికే దాదాపు  పోలింగ్ ముగింపు దశకు వచ్చింది. టీడీపీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు అంతా కలిసి ఒకేసారి అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. అంటే టీడీపీ వైపు ఉన్న 19 ఓట్లు సాలిడ్ గా ఆ పార్టీకి పడినట్టే లెక్క వేసుకుంటున్నారు. మొత్తం టీడీపీ 19 ఓట్లతో కలిపితే ఇప్పటి వరకు 174 ఓట్లు పోలు అయ్యాయి.. అంటే ఇంకా ఒక ఎమ్మెల్యే ఓటు వేయలేదు..

ప్రస్తుతం ఆ ఒక్క ఎమ్మెల్యే ఎందుకు ఇంకా ఓటు వేయలేదన్నది ఆసక్తి పెంచుతోంది.  చివరి నిమిషంలో ఓటు వేస్తారా.. లేక ఇంకా ఎవరికి  ఓటు వేయాలి అని ఆలోచనలో ఉన్నారా..? లేక ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా.. మరి ఫలితం ఎలా ఉండబోతోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేశారా..? లేక క్రాస్ ఓటింగ్ ఏదైనా జరిగిందా అని చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ , టీడీపీ మైండ్ గేమ్.. గంటా సంచలన వ్యాఖ్యలు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తరాంధ్రకు చెందిన అంటే విజయనరం జిల్లాలోని నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన అప్పలనాయుడు ఇంకా ఓటు వేయలేదని తెలుస్తోంది. ఇవాళ తన కుమారుడి వివాహం ఉండడంతో ఇంకా పోలింగ్ కు రాలేదు అంటున్నారు. వివాహ వేడుక అయిన తరువాత ప్రత్యేక చాపర్ లో విజయవాడకు వచ్చి.. ఆయన ఓటు వేస్తారని వైసీపీ నేతలు  చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu

ఉత్తమ కథలు