• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • GUNTUR AP COVID19 2 COMMAND CONTROL APP IS DEVELOPED FOR ONLINE MONITORING OF INDIVIDUAL VACCINATION DATA NGS

Corona App: ఏపీలో వ్యాక్సినేషన్ డేటా మోనిటర్ కు ప్రత్యేక యాప్. ఎలా పనిచేస్తుంది? ఎవరి కోసం

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్

ఏపీలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందరికీ వ్యాక్సినేషన్ చేరిందా లేదా అని తెలుసుకునేందుకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ను ఎలా యూజ్ చేయాలి? ఎవరికి ఉపయోగపడుతుంది.

  • Share this:
    ఏపీని కరోనా వెంటాడుతోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.  కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేదానిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. మరోసారి లాక్ డౌన్ పరిస్థితి రాకూడదని ఆయన కోరుతున్నారు. అందుకే లాక్ డౌన్ లేకుండానే కరోనా కట్టడికి ఏం చేయాలి అన్నదానిపై అధికారులకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న నైట్ కర్ఫ్యూని ఏపీలో కూడా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల మూసివేత, పరీక్షల వాయిదాపైనా సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

    అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్న సీఎం జగన్ మాత్రం. కోవిడ్ వ్యాక్సినేషన్ వే పూర్తి చేయడమే కరోనా కట్టడికి సరైన విరుగుడుగు అని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా ఏపీ కోడిడ్ 19 కమాండ్ కంట్రోల్ లో అధికారులతో సీఎం జగన్ రివ్యూ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీకా పంపిణీ చాలా వేగవంతమవ్వాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్లలో సగంమందికి టీకా పంపిణీ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన వారికి కూడా రెండు డోసులు త్వరగా అందేలా చూడాలని సీఎం సూచించినట్టు సమాచారం.

    ఏపీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో.. వ్యక్తిగత వాక్సినేషన్ డేటాను మోనిటర్ చేయడానికి యాప్‌ను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌కు హెచ్‌సీడబ్ల్యూ, ఎఫ్ఎల్‌డబ్ల్యూ డ్రైవ్‌గా పేరు పెట్టారు. ఈ యాప్‌ ద్వారా వాక్సినేషన్ వివరాలు.. ప్రతి మెడికల్ ఆఫీసర్ కచ్చితంగా పొందు పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రతి మెడికల్ ఆఫీసర్‌కు ఈ యాప్ యాక్సిస్ కోసం యూసర్ ఐడీ, పాస్వర్డ్ ని అందిస్తామన్నారు. ఈ యాప్‌లో ఒక్కసారి రిజిస్టర్ అయినా తరువాత.. వారి మొబైల్ నెంబర్, పేరు ద్వారా వ్యాక్సినేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి అంటున్నారు. ప్రతి ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు స్లాట్ విషయంలో ఎస్ఎంఎస్‌లు పంపి సోమవారం అందిరికీ వాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

    ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సినేషన్ డోస్ లను గన్నవరం నుంచి పంపిణీ చేశారు. తాజాగా పంపిణీ చేసిన డోసులు జిల్లాల వారిగా చూస్తే. శ్రీకాకుళం జిల్లాలో కోవిషీల్డ్ 23 వేల 450 డోసులు, కోవాక్సిన్ 5 వేల డోసులు అందాయి.  విజయనగరం జిల్లాకు కోవిసీల్డ్ 21 వేల 300 డోసులు, కోవిషీల్డ్
    5 వేలు డోసులు చేరాయి. విశాఖపట్నం జిల్లాకు కోవిషీల్డ్  51 వేల 450 డోసులు, కోవాక్సిన్ 15 వేలు డోసులు చేరాయి.  తూర్పు గోదావరి జిల్లాకు కోవిషీల్డ్  53,350, కోవాక్సిన్ 7 వేలు డోసులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిషీల్డ్  32,700 డోసులు , కోవాక్సిన్ 5 వేలు డోసులు ఉన్నాయి.  కృష్ణాజిల్లాకు కోవిషీల్డ్  42,650 డోసులు, కోవాక్సిన్ 15 వేలు డోసులు అందాయి. గుంటూరు జిల్లాకు
    కోవిషీల్డ్ 56వేల 300 డోసులు, కోవాక్సిన్ 12 వేలు డోసులు చేరాయి.  ప్రకాశం జిల్లాకు కోవిషీల్డ్
    31 వేల ,500 డోసులు, కో వాక్సిన్ 5 వేలు డోసులు అందాయి.  నెల్లూరు జిల్లాకు కోవిషీల్డ్ 26,800 డోసులు,  కోవాక్సిన్ 5 వేలు డోసులు పంపిణీ చేశారు.  చిత్తూరు జిల్లాకు కోవిషీల్డ్  54,800 డోసులు, కోవాక్సిన్ 8 వేలు డోసులు, కర్నూలు జిల్లా కు కోవిషీల్డ్ 39,500 డోసులు, కోవాక్సిన్  6,500 డోసులు,
    కడప జిల్లాకు కోవిషీల్డ ్26,300 డోసులు,  కోవాక్సిన్ 5,500 డోసులు,  అనంతపురం  జిల్లాకు 39,900 కోవిషీల్డ్  డోసులు ,  6 వేలు డోసులు కోవాక్సిన్ అందాయి.
    Published by:Nagesh Paina
    First published: