AP Inter Exams: ఏపీలో పరీక్షలపై పునరాలోచన చేయలాన్న హైకోర్టు. సీఎం జగన్ ఏమన్నారో తెలుసా

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? ఓ వైపు విపక్షాలు పరీక్షల రద్దు కోసం పట్టు పడుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల్లో ఎక్కువంది పరీక్షలు వద్దనే అంటున్నారు. తాజాగా కోర్టు కూడా పరీక్షలపై నిర్ణయాన్ని పునారాలోచించుకోవాలని కోరింది. దీనిపై సీఎం జగన్ మరోసారి స్పందించి పరీక్షలపై స్పష్టత ఇచ్చారు.

  • Share this:
    ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామంటోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు కూడా డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ విపక్షాలు, వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు సైతం పరీక్షలను రద్దు చేయాలి. లేదా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏపీలో పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలపై పునారాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 30 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన అంశంలో పునఃపరిశీలన చేసుకోవాలని కోర్టు కోరింది. పక్కరాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మే మూడున ఏం జరుగుతుంది? ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందని అందరిలో ఆసక్తి నెలకొంది.

    తాజాగా ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ స్పందించారు. ఏపీలో నాడు-నేడు పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్న అధికారులు, ఆ వివరాలను ప్రజెంటేషన్‌లో చూపారు. ఈ సందర్భంగా పది, ఇంటర్ పరీక్షలపై స్పష్టమైన ప్రకటన చేశారు.

    విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహిస్తున్నామని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని.. పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదన్నారు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది అని గుర్తు చేశారు. రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని.. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి అన్నారు. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా. కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటి అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: ఓ వైపు దేశానికి ఊపిరి పోస్తోంది. ఇక కోవిడ్ కేర్ సెంటర్ గా మారుతోంది. సాహో విశాఖ స్టీల్.

    విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నదన్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాము అన్నారు. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలన్నారు. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి అన్నారు. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దని. అన్ని కోవిడ్‌ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి అధికారులను సీఎం జగన్ హెచ్చరించారు.

    ఇదీ చదవండి: టీడీపీ, బీజేపీలకు బిగ్ షాక్. ఉప ఎన్నిక ఫలితానికి లైన్ క్లియర్

    నాడు-నేడుపై సమీక్షించిన సీఎం జగన్.. రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయండి అన్నారు. నాడు-నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి అన్నారు. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుందన్నారు.

    ఇదీ చదవండి: పది, ఇంటర్ పరీక్షల విజయానికి 15 సూత్రాలు. ఫాలో అయితే మీదే గెలుపు

    స్కూళ్లలో పెయింటింగ్‌ పనులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి అన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదని అధికారులకు హెచ్చరించారు. అందుకు పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలని స్పష్టం చేశారు. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదన్నారు జగన్? మే, జూన్‌ నెలల్లో పూర్తిగా పనులు నాణ్యతను చూడాలని. ప్రతి స్కూల్‌ సందర్శించాలి. అన్నీ నోట్‌ చేయాలి. క్వాలిటీ ఆడిట్‌ పూర్తి కావాలి. టాయిలెట్‌ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

    ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పగలుగుతారన్నారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలన్నారు. ఈసారి కిట్లలో ఇంగ్లిష్‌ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలని.. జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు–నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలన్నారు.
    Published by:Nagesh Paina
    First published: