Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (Andhra Pradesh Government) తీరుపై తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారాడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతూ.. కాసుల కక్కుర్తితో.. సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆయన గ్యాంగ్ సభ్యులు రాష్ట్రంలోని కొండలనూ వదలడం లేదన్నారు. వాటిని చెరువులుగా.. భూములుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఏపీలో 75 శాతం అడవులను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని.. వారి ధనకాంక్ష తీరడం లేదన్నారు. అందుకే ఇలా చేస్తే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని అన్నారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నం (Visakhapatnam) లోని రుషికొండ (Rushikonda) ను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. అలాగే విశాఖ-తూర్పు గోదావరి సరిహద్దుల్లోని బమిడికలొద్దిలో భారతీ సిమెంట్ కోసం తవ్వకాలు జరుపుతున్నారని. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు.
కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి రవ్వలకొండను తవ్వారని ప్రతిపక్ష నేత ఆరోపించారు. అలాగే కాకినాడ, చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నామన్నారు. ఇంకా విజయనగరం, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవ్వల కొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని.. అలాంటి కొండను తవ్వేసి సెంటిమెంటును దెబ్బ తీశారన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడలో మడ అడవులు కొట్టేశారని.. తుఫాన్‌ల నుంచి రక్షణగా నిలిచేందుకు మడ అడవులు ఉపయోగపడతాయని ప్రతిపక్ష నేత అభిప్రాయపడ్డారు. ప్రకృతి నాశనం అయ్యేలా వ్యవహరిస్తోన్న అంశంపై సీఎం జగన్ సమాధానం రాష్ట్ర ప్రలజలందరికీ సమాధానం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. కేవలం తన సొంత కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారన్నారని మండిపడ్డారు.
కొండల్ని చెరువులుగా మారుస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ - టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/CfBRFyaIAn
— Telugu Desam Party (@JaiTDP) July 13, 2022
ఇక కుప్పంలో కూడా ఇదే తరహాలో తవ్వేస్తున్నారన్నారని.. కుప్పంలో అక్రమంగా జరిగే మైనింగ్ ప్రాంతం దగ్గరకు తాను వెళ్లినా రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారనే ఖండకావరం వైసీపీ పెరిగిందన్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అని తెలియడంతో దొరికినంత దోచుకో అనే స్థాయిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక..! పోలవరంపై ప్రభావమెంత?
కొండల్ని సైతం అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. అలాంటి వారందర్ని బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకెళ్లిందని.. 60 మందికి పైగా ప్రాణాలు పోయాయన్నారు. ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన తరహాలో వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఏపీలో గ్రీనరీ కవర్ పెంచామని.. చెట్ల వల్లే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Guntur, TDP