హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan vs Ambati: వారాహిని టచ్ చేసి చూడండంటూ పవన్ సవాల్.. గాడిదలం కాదంటూ అంబటి కౌంటర్

Pawan vs Ambati: వారాహిని టచ్ చేసి చూడండంటూ పవన్ సవాల్.. గాడిదలం కాదంటూ అంబటి కౌంటర్

పవన్ వర్సెస్ అంబటి

పవన్ వర్సెస్ అంబటి

Pawan vs Ambati: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ-జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా సత్తెనపల్లిలో పర్యటించిన పవన్.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.. టచ్ చేసి చూడండి.. నేనేంటో చూపిస్తానంటూ..? ఛాలెంజ్ చేశారు.. మరోవైపు మంత్రి అంబటి సైతం అదే స్థాయిలో పవన్ కు కౌంటర్లు వేశారు.. ఆయనేమన్నారంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sattenapalle, India

Pawan vs Ambati: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ (YCP), విపక్ష జనసేన (Janasena) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సత్తెనపల్లి (Sattenapalli) పర్యటనతో యుద్ధం తారాస్థాయికి చేరింది. కౌలురైతు సభలో మాట్లాడిన పవన్.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. తన వారాహి వాహనాన్ని టచ్ చేస్తే.. తానేంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు లేవని, అభిమానులు ఇచ్చిన విరాళాలతోనే పార్టీని నడుపుతున్నానని, పార్టీ నడపడం తన బాధ్యత అన్నారు. అన్నం పెట్టిన నేలకి మేలు చేయకుండాపోతే అదేం బ్రతుకని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే.. అది క్షేమం కాదన్నారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు చనిపోయినా.. వైసీపీకి చీమ కుట్టినట్టు కూడా ఉండదన్నారు. ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఏ జిల్లాలోనూ రైతు క్షేమంగా లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ప్రతిపక్షాలను బెదిరించడానికి, సభ జరుపుకోవద్దని చెప్పుకోవడానికి అధికార యంత్రాంగం ఉందని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కౌంటర్ వేశారు. వారాహి రంగు బాగులేదంటూ విమర్శలు చేస్తున్నారని.. అసలు మీరు చేసే దోపిడి ముందు ఈ రంగు ఎంత అంటూ పవన్ ప్రశ్నించారు. కరప్షన్ హాలీడే ప్రకటించినట్లు వాళ్ళ నాయకుడే చెప్పాడని పవన్ గుర్తు చేశారు. కానీ తాను అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నానన్నారు.

అధికార పార్టీలో ఉండే గాడిదలకు తాను భయపడనని.. వాళ్లు అరుపులు, కేకలు పెడుతున్నారని విమర్శించారు. సత్తెనపల్లి నాయకులు వచ్చిన ఏడు లక్షలివ్వాలంటే, రెండు లక్షల లంచం తీసుకుంటున్నారని.. ఎమ్మెల్యే స్థాయి నేత దోపిడి చేస్తే ఎలా.. అని ప్రశ్నించారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విరుచుకుపడిన పవన్.. పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తనను రానివ్వను అంటూ బెదిరిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకుండా చూసే బాధ్యత తనది అన్నారు.

ఇదీ చదవండి : టీడీపీ మాట మార్చింది.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పిన మంత్రి రోజా

కచ్చితంగా ఈసారి ప్రభుత్వం మారబోతోందని, వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఏడు లక్షలకు రెండు లక్షలలు తీసుకునే దరిద్రపు మనస్తత్వం తనది కాదన్నారు. అంబటి రాంబాబులా శవాలపై పేలాలు ఏరకోలేనని.. వైసిపి గాడిదల్లా మాట్లాడలేని అన్నారు. బీసీలకు బిర్యానీ పెట్టామని కాదు.. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చామని ఆలోచించుకోవాలని పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న దానికి ఇఫ్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ , టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. మీ అందరి గుండె చప్పుడుంటే.. తాను సీఎం అవుతానన్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఎలా నిర్వహిస్తారంటే?

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ వ్యాఖ్యలుపై అంబటి సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో పవన్ ఉద్దేశిస్తూ.. తాము కాదు గాడిదలం! బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి అంటూ సెటైర్లు వేశారు.

మేము కాదు గాడిదలం!

సలు రాజకీయ నేతగా చూడట్లేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన పర్యటన, యాత్ర కారణంగా భయపడాల్సిన అవసరం తమకులేదని మంత్రి స్పష్టం చేశారు. వేరే ఎవరి కోసమో పనిచేసే వీకెండ్ లీడర్ పవన్ కల్యాణ్ అని ఆరోపించారు.

First published:

Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan, Ycp

ఉత్తమ కథలు