హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Hindu Temple: ఛీఛీ గుడిలో ఈ వెధవ పని ఏంటి..? వారి తీరుపై మండిపడుతున్న భక్తులు.. అసలేం జరిగిందో చూడండి

Hindu Temple: ఛీఛీ గుడిలో ఈ వెధవ పని ఏంటి..? వారి తీరుపై మండిపడుతున్న భక్తులు.. అసలేం జరిగిందో చూడండి

ఛీఛీ ఆలయంలో ఇదేం పని

ఛీఛీ ఆలయంలో ఇదేం పని

Liquor Gang: గుడికి బడి అని కూడా కొందరు చూడడం లేదు. పవిత్రమైన దేవాలయంలో కొన్ని పనులు నిషేధం అయినా.. కొందరు మాత్రం ఆ రూల్స్ తమకు వర్తించవు అంటున్నారు. తాజాగా బాపట్లలో జరిగిన ఓ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఛీ ఇదేం పని అని నిలదీస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bapatla, India

  Liqour Auction at Temple:ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం వైన్ షాపులు (AP Wine Shops) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అయినా విమర్శలు తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేసి.. వాటన్నింటినీ ఎక్సైజ్ శాఖే నడిపిస్తోంది. మద్యపాన నిషేధం (Liquor Ban) లో భాగంగా షాపుల సంఖ్య కూడా తగ్గించింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ధరలు కూడా పెంచింది. మద్య పానం నిషేధం అంటూ.. ధరలు పెంచడం.. అది కూడా ప్రభుత్వమే వైన్ షాపులను (Government Wine Shops) ప్రోత్సహించడం ఏంటనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏపీలో దొరికే పేరు లేని బ్రాండ్స్ పైనా.. నిత్యం ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే.. ఇవేం బ్రాండులురా బాబు అని సెటైర్లు పేలుతుంటాయి. కొత్త కొత్త మీమ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే అందరికాన్న ఎక్కువగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేది కూడా మందుబాబులే అవుతున్నారు. మందు ముట్టకుండానే.. ధరలు చూసి కిక్కు ఎక్కుతోందని.. అది కూడా పిచ్చి బ్రాండ్లకు ఇంత ఖర్చు చేయాలా అంటూ పలు సందర్భాల్లో మందుబాబు మండిపడ్డారు.. తాజా మరో ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.


  బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. ఆ నిర్వహణే ఇప్పుడు వివాదానికి కేంద్రం అయ్యింది. ఆ గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విమర్శల పాలయ్యారు. అయితే అధికారులు ఈ వేలం పాటను.. ఆలయంలో నిర్వహించడం అందరికీ షాక్ ఇచ్చింది. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు.  గ్రామస్థులంతా ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలో తెలియడంతో భక్తులు అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. అయితే వేలం పాట పూర్తవ్వడంతో అక్కడవారంతా చల్లగా జారుకున్నారు.  ఇదీ చదవండి : ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కుమ్ములాటలు.. బహిరంగంగానే బాహాబాహీ


  అయితే ఈ వేలం పాటలో బెల్టు షాపును ఓ వ్యక్తి 7 లక్షల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. వేలం పాటలో ఎంత ధర పలికినా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తుల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బడులు, గుడులు దగ్గర వైన్ షాపులు ఉండకూడదనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలకు కొనసాగుతున్న సమయంలో.. ఇప్పుడు నేరుగా ఆలయంలోనే వేలం పాటు వేయడం వివాదస్పదం అవుతోంది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, Liquor policy, Liquor shops

  ఉత్తమ కథలు